AIDS Day: హెచ్‌ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో..

Published on Mon, 12/01/2025 - 09:09

‘హెచ్‌ఐవీ’ నేటికీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని బారిన పడినవారు నిరంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. నేడు డిసెంబర్‌ ఒకటి.. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ నివారణకు ప్రపంచవ్యాప్తంగా  జరుగుతున్న పరిశోధనలు ఏం వెల్లడించాయి? ఎటువంటి పరిష్కారాలను సూచిస్తున్నాయనే వివరాల్లోకి వెళితే..

ఆశాజనకమే.. కానీ..
హెచ్‌ఐవీ అంటువ్యాధిని నివారించడంలో సైన్స్ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇప్పుడు యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ)తో హెచ్‌ఐవీ బాధితులు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఈ వైరస్‌ను శాశ్వతంగా తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు క్లినికల్ పరీక్షలలో ఆశాజనకమైన ప్రారంభ ఫలితాలను సాధిస్తున్నప్పటికీ, హెచ్‌ఐవీ నిజంగా నయం అవుతుందా? అనేది ఇంకా పూర్తిగా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది.

స్టెమ్ సెల్స్‌ సాయంతో..
ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించగల హెచ్‌ఐవీ చికిత్స అందుబాటులో లేదని ROPAN హెల్త్‌కేర్ వ్యవస్థాపకురాలు, యూఎన్‌ సలహాదారు డాక్టర్ సబీన్ కపాసి తెలిపారు. అయితే బెర్లిన్, లండన్‌కు చెందిన పలువురు రోగులు  స్టెమ్ సెల్ మార్పిడి తర్వాత దీర్ఘకాలిక ఉపశమనాన్ని (functional cure) పొందారు. ఈ వ్యక్తులు సీసీఆర్‌ఎస్‌ మ్యుటేషన్ కలిగిన దాతల నుండి స్టెమ్ సెల్స్‌ను స్వీకరించారు. ఇది వైరస్‌ను కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఈ కేసులు చికిత్స జీవశాస్త్రపరంగా సాధ్యమే అని నిరూపించినప్పటికీ, స్టెమ్ సెల్ మార్పిడిలో ప్రాణాంతక ప్రమాదాలు ఉన్నందున, ఇది కేవలం తీవ్రమైన క్యాన్సర్లకు చికిత్స చేయడానికి మాత్రమే పరిమితమై ఉంది. అందువల్ల దీనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి ఆచరణీయమైన మార్గం కాదని వెల్లడయ్యింది.

సవాల్‌ విసురుతున్న వైరల్ రిజర్వాయర్లు 
హెచ్‌ఐవీ చికిత్సకు సంబంధించి కొత్త పరిశోధనలు  విస్తృత స్థాయిలో సురక్షితంగా ఉపయోగించగల విధానాలపై దృష్టి సారించాయి. పరిశోధకులు సీసీఆర్‌ఎస్‌ గ్రాహకాన్ని నిలిపివేయడానికి లేదా వైరస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ వంటి జన్యు-ఎడిటింగ్ సాధనాలను పరీక్షించడం సహా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అధ్యయనాల నుండి లభ్యమైన ప్రారంభ క్లినికల్ డేటా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, హెచ్‌ఐవీకి చెందిన దాగి ఉన్న వైరల్ రిజర్వాయర్లు (latent reservoirs) ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయాయి. ఈ రిజర్వాయర్లు వైరస్‌ను కణజాలాలలో దాచి ఉంచుతాయి. చికిత్సను నిలిపివేసిన తర్వాత వైరస్ తిరిగి పెరగడానికి కారణమవుతాయి.

ఇప్పటికింతే..
ఈ అడ్డంకిని అధిగమించడానికి పరిశోధకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్‌ఐవీ నివారణ దశగా పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ఔషధాలు   త్వరలోనే అందుబాటులోకి వస్తాయనే హామీని ఎవరూ ఇవ్వడంలేదు. ప్రస్తుతానికి హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించడానికి అత్యంత శక్తివంతమైన విధానం యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ). దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది వైరల్ లోడ్‌ను కనీస స్థాయికి తీసుకువస్తుంది. బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. సంక్రమణ ముప్పును నివారిస్తుంది. అసురక్షిత లైంగిక సంపర్కం హెచ్‌ఐవీకి ‍ప్రధాని కారణమని, దీనికి సురక్షిత విధానాలే పరిష్కార మార్గమని వైద్యులు చెబుతుంటారు.

ఈ ఏడాది థీమ్‌.. కార్యక్రమాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్‌ ప్రతిస్పందనను మార్చడం’ అనే థీమ్‌తో 2025 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని జరుపుకునేందుకు పిలుపునిచ్చింది. సమాజంలో ఎయిడ్స్‌ బాధితులను చిన్నచూపు చూడటం లాంటి అంతరాలను తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధమైన పిలుపునిచ్చింది. 2030 నాటికి ఎయిడ్స్‌ అంతం చేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు అంతర్జాతీయ ‍స్థాయిలో అందరి సహకారం అవసరమని తెలిపింది. హెచ్‌ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితులపై వివక్షను రూపుమాపేందుకు, నేడు పలుచోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.  ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, గోప్యంగా హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే బాధితులకు ఏఆర్‌టీ మందులు పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌నార్‌లు నిర్వహిస్తోంది. ఈ రోజున హెచ్‌ఐవి బాధితులకు మద్దతుగా పలుచోట్ల ప్రజలు రెడ్ రిబ్బన్‌లు ధరిస్తారు. ఈ వ్యాధితో మరణించిన వారి జ్ఞాపకార్థం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తారు. 

ఇది కూడా చదవండి: మళ్లీ శశిథరూర్‌ లొల్లి.. ఈసారి అమ్మ కారణం?

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)