Breaking News

భారత్‌తో ఒప్పందం చరిత్రాత్మకం: ట్రంప్‌

Published on Thu, 02/12/2026 - 07:47

వాషింగ్టన్‌: తాము భారతదేశంతో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  అభివర్ణించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి బొగ్గు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిందన్నారు. జపాన్, కొరియా తదితర దేశాలతో పాటు భారత్‌తో కుదిరిన ఈ తాజా ఒప్పందాలు అమెరికా ఇంధన ఎగుమతులను మరింత విస్తృతం చేస్తాయని ట్రంప్ అన్నారు. తమ దేశ బొగ్గు ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినదని ట్రంప్‌ పేర్కొన్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు దాదాపు ఏడాది కాలం పాటు సాగి, చివరకు ఒక కొలిక్కి వచ్చాయి. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈ తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యాయి. 2025 ఆగస్టులో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు చేస్తున్నారనే నెపంతో అమెరికా.. భారత్‌పై 50 శాతం సుంకాలను విధించడంతో చర్చలు స్తంభించాయి. అయితే, తాజా దౌత్యపరమైన ముందడుగుతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను చక్కదిద్దింది.

ఈ నూతన ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. గతంలో 50 శాతంగా ఉన్న సుంకాన్ని ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, పోటీ మరింతగా పెరగనుంది. వాషింగ్టన్ విడుదల చేసిన 'ఫ్యాక్ట్ షీట్' ప్రకారం ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందాయి. ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది.

ఈ సుంకాల తగ్గింపు నిర్ణయంతో భారతదేశంలోని కీలక రంగాలకు భారీ లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్ ఎగుమతులు పెరగనున్నాయి. వీటితో పాటు గృహాలంకరణ వస్తువులు, హస్తకళాకృతులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాల విభాగాల్లో భారతీయ ఎగుమతిదారులు అమెరికా మార్కెట్లో తమ పట్టును సాధించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం భారతీయ పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)