Breaking News

కారు పైకెక్కించి.. బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు

Published on Sat, 01/17/2026 - 19:50

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్‌లో డీజిల్‌ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై  కారు ఎక్కించాడు. ఈ ఘటన అక్కడి మతఛాందసవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలను భారత్ ఎంతగా ఖండించిన అక్కడి మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం మైనారిటీలపై దాడుల అంశం ప్రస్థావనకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ మరోసారి హిందూ యువకునిపై దాడి జరిగింది.

డైలీ స్టార్ కథనం ప్రకారం.. రిపోన్ సోహ అనే హిందూ యువకుడు అక్కడి స్థానిక పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అక్కడికి ఎస్‌యూవీ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి రూ. 3,710 డిజీల్‌ వాహనంలో కొట్టించాడు. దీంతో అతనిని డబ్బులు చెల్లించాలని ఆ  అడిగాడు. దీనికి అతను నిరాకరించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది సోహ  వాహనం ఎదుట నిలుచున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి అతనిపైనుంచి వాహనాన్ని నడిపాడు. దీంతో రిపోన్ సోహా అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాహానాన్ని సీజ్‌ చేసి నిందితులను అరెస్టు చేశారు.  కాగా ఆవాహనం NCP పార్టీకి చెందిన మాజీ నేత అబుల్ హషీంకు చెందినదిగా గుర్తించిట్లు పోలీసులు తెలిపారు.బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై అక్కడి మానవహక్కుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మైనార్టీలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోకుండా భయాందోళనలకు గురిచేసేందుకే అక్కడి అల్లరి మూకలు ఈ దాడులు జరుపుతున్నట్లు హుమన్‌రైట్స్ కమిషన్ ఆరోపిస్తుంది. 

బంగ్లాదేశ్‌ జనాభాలో హిందువులు 7.95 శాతం కోటి 14 లక్షల మంది ఉన్నారు. కాగా వచ్చేనెలలో బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 

 

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)