Breaking News

పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం

Published on Wed, 09/27/2023 - 16:28

ఒ‍ట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో కెనడా హిందూ ఫోరం ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్‌కు విజ్ఞప్తి చేసింది.

గురుపత్వంత్ సింగ్‌ పన్నూ అమెరికాకు చెందిన సిక్స్‌ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనేది ఈ సంస్థ ఆశయం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కూడా పన్నూ ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేశాడు. ఈ క్రమంలో హిందువుల పట్ల ఆయన విద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పన్నూపై కెనడాలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇరు దేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. కెనడా, యూకే, అమెరికా సహా విదేశాల్లో ఉన్న 18 మంది ఖలిస్థానీ నాయకులను ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఇండియాలో వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ జాబితాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకరు.

కెనడాలో హిందువులు దేశం విడిచి వెళ్లాలని గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల వివాదాస్పద ప్రకటనలు జారీ చేశాడు. ఖలిస్థానీ మద్దతుదారులకే కెనడాలో స్థానం ఉందంటూ మాట్లాడారు. దీంతో అక్కడి హిందూ సంఘాలు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక ఐఎస్‌ఐ హస్తం

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)