Breaking News

ఇజ్రాయెల్‌ దాడిలో హెజ్‌బొల్లా కీలక నేత హతం

Published on Mon, 11/24/2025 - 07:17

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఆదివారం ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడిలో హెజ్‌బొల్లా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న హయథమ్‌ అలీ తబ్‌తబై సహా ఐదుగురు చనిపోగా 24 మంది గాయపడ్డారు. జూన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడి జరపడం ఇదే మొదటిసారి.

బీరుట్‌ శివారులోని హరెట్‌ హెచ్‌చీక్‌ ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌పై కచ్చిత లక్ష్యంతో దాడి జరిపినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. హెజ్‌బొల్లా సీనియర్‌ మిలిటెంట్‌ హయథమ్‌ అలీ తబ్‌తబై హతమయ్యాడని తెలిపింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈయనపై ఇజ్రాయెల్‌ హత్యాయత్నం చేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన క్షిపణి దాడిలో హయథమ్‌ గాయపడ్డారా లేదా చనిపోయారా అనేది హెజ్‌బొల్లా ధ్రువీకరించలేదు. దాడి కారణంగా అపార్టుమెంట్‌ భవనం పూర్తిగా దెబ్బతిందని, పలు కార్లతోపాటు చుట్టుపక్కల భవనాలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. రెండు క్షిపణులు ఆ భవనంపై పడినట్లు స్థానికులు తెలిపారు. హెజ్‌బొల్లాలోని శక్తివంతమైన రద్వాన్‌ యూనిట్‌కు హయథమ్‌ సారధ్యం వహిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం 2016లో ఈయన్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈయన తలపై 5 లక్షల డాలర్ల రివార్డు ఉంది.    

ఇదిలా ఉండగా.. హయథమ్‌ అలీ టార్గెట్‌ కారణంగా దహియేలో భయాందోళన నెలకొంది. అక్కడ దాడులకు కొన్ని క్షణాల ముందు యుద్ధ విమానాల గర్జన విన్నట్లు నివాసితులు తెలిపారు. వాహనాలు మరియు భవనాలు ధ్వంసమై కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో 24 మందికిపైగా పౌరులు మృతి చెందినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, హెజ్‌బొల్లా కమాండర్‌కు నివాసంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలలో ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే మొదటిది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)