Breaking News

హమాస్‌ నేత ముహమ్మద్ సిన్వార్‌ హతం?

Published on Thu, 05/22/2025 - 12:14

టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) సంచలన ప్రకటన చేశారు. హమాస్ నేత ముహమ్మద్ సిన్వార్‌ను తమ సైన్యం చంపివుండవచ్చని పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు .. గాజాలో 20 మంది బందీలు బతికే ఉన్నారని, 38 మంది  వరకూ మరణించి ఉంటారని, అక్కడ చిక్కుకున్న బందీలను త్వరలోనే  తీసుకువస్తామని ఆయన ఇజ్రాయెల్‌ ప్రజలకు హామీ ఇచ్చారు.

గాజాలో తమ సైనిక లక్ష్యాల కోసం  నిర్మాణాత్మక ప్రణాళిక కొనసాగుతున్నదని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే తాము పదివేల మంది ఉగ్రవాదులను తదముట్టించామని, హమాస్‌ నేతలు డీఫ్, హనియే, యాహ్యా సిన్వార్, మొహమ్మద్ సిన్వార్ నాయకులను  అంతమొందించామని నెతన్యాహు చెప్పినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది.

ఇజ్రాయెల్(Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరించడాన్ని యూకే, ఫ్రాన్స్, కెనడాలు తప్పుపట్టాయి. కాగా హమాస్‌పై సంపూర్ణ విజయం సాధించడానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని నెతన్యాహు పునరుద్ఘాటించారు. ఇది అనాగరికతపై నాగరికతా యుద్ధమని, దీనిలో పూర్తి విజయం సాధించే వరకు ఇజ్రాయెల్ న్యాయపరమైన మార్గాల ద్వారా తనను తాను రక్షించుకుంటూనే ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు. పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లోకి చొరబడి, 1,200 మంది అమాయకులను హత్య చేసి, 250 మందికి పైగా అమాయకులను గాజాలో బంధించిన నేపధ్యంలో ఈ యుద్ధం ప్రారంభమైందని నెతన్యాహు గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: 103 అమృత్‌ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)