Breaking News

ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా

Published on Mon, 04/29/2024 - 10:54

పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా  పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.

తాజాగా ప్రఖాత్య హార్వర్డ్‌ యూనివర్సిలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్‌ యార్డ్‌లోని జాన్‌ హార్వర్డ్‌ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్‌ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్‌లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. 

గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్‌ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్‌ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)