Breaking News

Hamas: గాజాలో దాడులు ఆపితే.. ఒప్పందానికి రెడీ

Published on Fri, 05/31/2024 - 07:43

ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ను‌ అంతం చేయటమే లక్ష్యంగా రఫాపై దాడులకు తెగబడుతోంది.గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 53 మంది మృతి చెందగా మరో 357 మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇజ్రాయల్‌ భీకర దాడుల నేపథ్యంలో హమాస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గాజా పౌరులపై దాడులు ఆపేస్తే.. ఇజ్రాయెల్‌తో తాము పూర్తి ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్‌ మలిటెంట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌ బంధీలను సైతం వెంటనే వదిలేస్తామని తెలిపారు.

‘‘ గాజాపై ఇజ్రాయెల్ ఇలానే దాడలు, మారణహోనం కొనసాగిస్తే..  హమాస్‌, పాలస్తీనా వర్గాలు ఎట్టిపరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించవు. అందుకే మేము మధ్యవర్తులకు తెలిపుతున్నాం. గాజా పౌరులపై దాడులు ఆపితే.. ఇజ్రాయెల్‌తో పూర్తి ఒప్పందం చేసుకోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్ ‌బంధీలను వెంటనే వదిలేస్తాం’’ అని హమాస్‌  పేర్కొంది

అంతర్జాతీయ న్యాయ స్థానం.. గాజాలో దాడులు ఆపాలన్నా ఇజ్రాయెల్‌ దక్షిణ గాజాలోని రఫా నగరంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో  రఫా నగరంలో తల దాచుకుంటున్న అమాయక పాలస్తీనా పౌరులు మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హమాస్‌ వెనక్కి తగ్గి ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ఇక.. గతంలో కూడా కాల్పుల విరమణ హమాస్‌ ముందుకు  ఇచ్చినా ఇజ్రాయెల్‌ తిరస్కరిచిన విషయం తెలిసిందే.తమ దేశానికి ముప్పుగా ఉన్న హమాస్‌ను పూర్తిగా అంతం చేసేవరకు తమ దాడులు కొనసాగిస్తామని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 36,171 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)