Breaking News

‘ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి’

Published on Sun, 12/01/2024 - 12:58

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌,హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొలిక్కిరావడం ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్‌ యువకుడు ఎడాన్‌ అలెగ్జాండర్‌ వీడియోను హమాస్‌ తాజాగా విడుదల చేసింది. 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తమ విడుదలకు ప్రయత్నించాలని బందీగా ఉన్న యువకుడు వీడియోలో ఏడుస్తూ మొర పెట్టుకున్నారు. తామంతా ఇక్కడ రోజుకు వెయ్యిసార్లు చస్తున్నామని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా,ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే హమాస్ మిలిటరీ విభాగం అల్‌ కస్సామ్‌ బ్రిగేడ్‌ ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం. 

ఈ వీడియోపై ఎడాన్‌ తల్లి యేల్‌ స్పందించారు. తన కుమారుడి వీడియో తనను కలవరపరిచిందని, హమాస్‌ వద్ద ఉన్న బందీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది తెలియజేస్తోందన్నారు. ఈ వీడియోపై ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహు కార్యాలయం స్పందించింది. ఇలాంటి హమాస్ వ్యూహాలు ఇజ్రాయెల్‌ లక్ష్యాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. హమాస్‌ వద్ద ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని తెలిపింది. 

గత ఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేయడంతో సుమారు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని తమతోపాటు పాలస్తీనాలోని గాజాకు తీసుకెళ్లింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 43వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

 

#

Tags : 1

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)