Breaking News

దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్

Published on Wed, 10/18/2023 - 10:58

జెరూసలేం: గాజా ఆస్పత్రిపై దాడిలో వందల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో గాజా నగరం అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్‌ దాడులతో ఉత్తర గాజా సగభాగాన్ని ప్రజలు ఇప్పటికే ఖాలీ చేశారు. దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ కూడా హతమయ్యారు. ఈ క్రమంలో హమాస్‌ నుంచి కీలక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ దాడులను తక్షణమే నిలిపివేస్తే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తామని ప్రకటన వెలువడినట్లు సమాచారం. హమాస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్‌ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.

'మంగళవారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్ దాడులు జరిపింది. అందులో విఫలమైన ఓ రాకెట్ ఆస్పత్రిపై పడింది. మా బలగాలు ఆ ఆస్పత్రిపై రాకెట్‌ను ప్రయోగించలేదు.' అని ఐడిఎఫ్‌(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది.

ఆసుపత్రిపై జరిగిన దాడిని పాలస్తీనా అధికారులు ఊచకోతగా పేర్కొన్నారు. గాజాలో ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందలాది మంది మరణించడంతో మూడు రోజుల సంతాప దినాలను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. 'మారణహోమం జరుగుతోంది. ఈ మారణకాండను ఆపడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలి. మౌనం ఇకపై ఆమోదయోగ్యంకాదు'అని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రకటన వెలువరించింది. 

అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష‍్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్‌లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు.

ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)