Breaking News

హమాస్‌ మిలటరీ చీఫ్‌ హతం.. ధృవీకరించిన ఇజ్రాయిల్‌

Published on Thu, 08/01/2024 - 14:55

హమాస్‌పై పోరాటం చేస్తున్న ఇజ్రాయిల్‌కు భారీ విజయం దక్కింది. గాజాపై జరిపిన వైమానిక దాడిలో హమాస్‌ మిలిటరీ వింగ్‌ చీఫ్‌ మహ్మద్‌ డెయిఫ్‌ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ వెల్లడించింది. గత నెల జూలై 13న ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంపై జరిపిన దాడిలో మహ్మద్‌ డెయిఫ్‌ను అంతమొందించినట్లు గురువారం ధృవీకరించింది. ‘

జూలైలో గాజా దక్షిణ ప్రాంతంలో జరిపిన దాడిలో మహమ్మద్‌ డెయిఫ్‌ చనిపోయాడు. ఈ విషయాన్ని మేము ఇప్పుడు ధృవీకరిస్తున్నాం’ అని ఇజ్రాయిల్‌ ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది. కాగా అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడికి మహ్మద్ డెయిఫే ప్రధాన సూత్రధారిగా ఇజ్రాయిల్‌ భావిస్తోంది.

అయితే హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా ఇరాన్‌లో దారుణ హత్యకు గురైన మరుసటి రోజే ఇజ్రాయిల్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియాతోపాటు సెక్యూరిటీ గార్డ్‌ సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇజ్రాయిల్‌ ప్రమేయం ఉందని ఇరాన్‌ ఆరోపిస్తుంది.

ఇక జూలైలో ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 90 మంది మృతి చెందారు. మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్‌ మిలిటరీ వింగ్‌ కమాండర్‌ మహమ్మద్‌ డెయిఫ్‌, మరో కీలక కమాండర్‌ రఫా సలామాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. అయితే ఆరోజు వీరు మరణించినట్లు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిని హతం చేసినట్లు నిర్ధారించింది.

ఎవరీ మహ్మద్‌ డెయిఫ్‌ 
గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ జరిపిన భారీ వైమానిక దాడి వెనక మహ్మద్‌ డెయిఫ్‌ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ మరణకాండలో ఇజ్రాయిల్‌కు చెందిన 1200 మంది మరణించారు. దాదాపు 250 మందిని హమాస్‌ తమ వద్ద బందీలుగా పట్టుకుంది. ఈ ఘటనే ఇజ్రాయెల్‌-హమాస్‌ల యుద్ధానికి దారితీసింది. డెయిఫ్‌ ఏళ్లుగా ఇజ్రాయెల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు.

గాజాలోని ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్‌ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్‌ డియాబ్‌ ఇబ్రహీం అల్‌ మస్రీ. 1980ల చివర్లో హమాస్‌లో చేరాడు.  డెయిఫ్‌  హమాస్‌ మిలిటరీ యూనిట్‌ ‘అల్‌ కస్సం బ్రిగేడ్‌’లో పనిచేశాడు. హమాస్‌ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు సన్నిహితుడు. అతడు ఇజ్రాయెల్‌ దళాల చేతిలో హతమయ్యాక.. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్‌ బాధ్యతలు డెయిఫ్‌ చేపట్టాడు.

హమాస్‌ వాడే ‘కస్సాం’ రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్‌ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం వెనుక మాస్టర్‌ మైండ్‌ కూడా ఇతడే. ఇజ్రాయెల్‌ దళాలకు చిక్కకుండా ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని సమాచారం. ఇప్పటి వరకు డెయిఫ్‌పై ఇజ్రాయెల్‌ దళాలు ఏడుసార్లు దాడులు చేయగా ప్రతిసారీ  తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షానికి రూపకర్త కావడంతో మరోసారి కోసం తీవ్రంగా జల్లెడ పట్టిన ఇజ్రాయెల్‌.. ఎట్టకేలకు అతడిని హతమార్చింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)