Breaking News

హమాస్‌కు కొత్త బాస్‌.. గాజా కన్నీళ్లు తుడుస్తాడా?

Published on Wed, 07/22/2026 - 13:55

యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితంతో అల్లాడుతున్న గాజాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్‌ కొత్త అత్యున్నత నాయకుడిగా ఖలీల్‌ అల్‌-హయ్యా ఎన్నికయ్యారు. యాహ్యా సిన్వార్‌ తర్వాత సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయనకు హమాస్‌ అంతర్గత ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నాయకత్వ మార్పుతో గాజా ప్రజల ముఖచిత్రంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు!..

యుద్ధం తమ ఇళ్లను, కుటుంబాలను, భవిష్యత్‌ను దెబ్బతీసిన వేళ.. హమాస్‌ నాయకత్వ మార్పుపై గాజా ప్రజల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొత్త నాయకుడు కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తుండగా.. మరికొందరు నాయకులు మారినా పరిస్థితులు మారకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరీ ఖలీల్‌ అల్‌-హయ్యా?
ఖలీల్‌ అల్‌-హయ్యా హమాస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్‌ రాజకీయ నేత. గాజాలో జన్మించిన ఆయన.. 1987లో హమాస్‌ ఏర్పాటైన నాటి నుంచి సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్లామిక్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. అనంతరం జోర్డాన్‌, సూడాన్‌లలో ఉన్నత విద్యను అభ్యసించారు.

రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన అల్‌-హయ్యా.. ఆ తర్వాత హమాస్‌లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుంచి విజయం సాధించారు. అనంతరం హమాస్‌ పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్‌ మాజీ నేతలు ఇస్మాయిల్‌ హనియె, యాహ్యా సిన్వార్‌లకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన.. సంస్థ రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు.

చర్చల బల్లపై కీలకంగా.. 
ఖలీల్‌ అల్‌-హయ్యాకు మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్‌తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్‌ తరఫున ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలపై ఖతార్‌, ఈజిప్ట్‌ వంటి మధ్యవర్తి దేశాలతో చర్చలు జరిపిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికతో భవిష్యత్‌లో హమాస్‌ చర్చల వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. యుద్ధాన్ని కొనసాగించే వైఖరినే అనుసరిస్తారా? లేక చర్చలకు మరింత ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

యుద్ధం మిగిల్చిన వ్యక్తిగత విషాదం
ఖలీల్‌ అల్‌-హయ్యా జీవితంలోనూ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. 2007లో ఆయన ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో భార్య, పిల్లలు, సోదరులు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లోనూ ఆయన కుటుంబానికి చెందిన మరికొందరు మరణించారు. ఈ వ్యక్తిగత విషాదాలు ఆయన రాజకీయ వైఖరిపై ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని కొనసాగించే నేతల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు.

గాజా ప్రజలకు బతుకే ముఖ్యం
హమాస్‌లో కొత్త నాయకుడు ఎన్నికైనప్పటికీ.. గాజాలో సామాన్య ప్రజల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇళ్లు కోల్పోయి, శిబిరాల్లో జీవిస్తున్న వేలాది కుటుంబాలకు రాజకీయ పరిణామాల కంటే రోజువారీ అవసరాలే ప్రధానంగా మారాయి. “మాకు నాయకులు మారడం ముఖ్యం కాదు.. మా పిల్లలకు ఆహారం కావాలి. తాగునీరు కావాలి. మందులు కావాలి. భయం లేకుండా జీవించే పరిస్థితి కావాలి” అని పలువురు గాజా ప్రజలు చెబుతున్నారు. మరికొందరు.. “ఏ నాయకుడు వచ్చినా మా జీవితాల్లో మార్పు కనిపించకపోతే ప్రయోజనం ఏమిటి? మాకు శాంతి కావాలి” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశలు.. అనుమానాలు రెండూ
ఖలీల్‌ అల్‌-హయ్యాకు చర్చల అనుభవం ఉండటంతో కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతా సహాయం వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం నాయకుడు మారినా హమాస్‌ ప్రాథమిక విధానాల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయన ఎన్నిక హమాస్‌ పోరాట వైఖరిని కొనసాగించే సంకేతమని విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు.

ముందున్న అతిపెద్ద సవాల్‌ ఇదే
ప్రస్తుతం ఖలీల్‌ అల్‌-హయ్యా ముందున్న సవాల్‌ హమాస్‌ను నడిపించడం మాత్రమే కాదు. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? కాల్పుల విరమణను స్థిరంగా కొనసాగించగలరా? అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య సంస్థ భవిష్యత్‌ వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారు? అన్నది కీలకంగా మారింది.

గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారగా.. ఆహారం, వైద్యం, విద్యుత్‌, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖలీల్‌ అల్‌-హయ్యా నాయకత్వంపై ప్రపంచం దృష్టి పెట్టినా.. గాజా ప్రజల ఆకాంక్ష మాత్రం ఒక్కటే. “మాకు రాజకీయ విజయాలు వద్దు.. మా పిల్లలు భయపడకుండా బతికే రోజు రావాలి.”

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)