Breaking News

షెడ్యూల్‌ ప్రకారమే  బందీలను విడుదల చేస్తాం

Published on Fri, 02/14/2025 - 02:50

కైరో: ఇజ్రాయెల్‌ బందీల విడుదల విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని హమాస్‌ తేల్చిచెప్పింది. మందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే బందీలకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తులు తమతో చెప్పారని వెల్లడించింది. ఈ మేరకు హమాస్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం చూస్తే మరో ముగ్గురు బందీలు శనివారం విడుదల కాబోతున్నారు. 

ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని హమాస్‌ స్పష్టమైన సంకేతాలిచ్చింది. హమాస్‌ ప్రకటనపై ఇజ్రాయెల్‌ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్‌ ఉల్లంఘిస్తోందని హమాస్‌ కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే.

 గాజాలో షెల్టర్లు నిర్మించుకొనేందుకు, విదేశాల నుంచి మానవతా సాయం సరఫరాకు అనుమతి ఇవ్వకపోతే బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. షెడ్యూల్‌ ప్రకారం బందీలను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గాజాపై మళ్లీ దాడులు ప్రారంభమవుతాయని హమాస్‌ను హెచ్చరించారు. దీంతో హమాస్‌ మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హమాస్‌ ఇప్పటిదాకా 21 మంది బందీలను విడిచిపెట్టింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం 730 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)