Breaking News

కాన్ఫరెన్స్‌ కాల్‌లో ట్రంప్‌-పిచాయ్‌-మస్క్‌!

Published on Thu, 11/21/2024 - 10:47

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌నకు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కాల్‌ చేశారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనందకు ట్రంప్‌నలకు అభినందనలు తెలిపారు. అయితే వీరి సంభాషణలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మాస్క్‌ చేరారు. 

గతంలో గూగుల్‌లో సెర్చ్‌ విషయంలో తప్పుడుగా చూపిస్తున్నట్లు మస్క్‌ ఆరోపణలు చేశారు. ట్రంప్‌ కోసం సెర్చ్‌ చేస్తే, కమలా హారిస్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయని, కానీ హారిస్‌ కోసం సెర్చ్‌ చేస్తే ట్రంప్‌ సమాచారం రావడం లేదని ఓ యూజర్‌ తెలపగా.. దానిని మస్క్‌ రీట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా.. పిచాయ్‌, ట్రంప్‌, మస్క్‌ టెలిఫోన్‌ సంభాషణపై ఆసక్తి నెలకొంది. మరి ఈ ముగ్గురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియరాలేదు. 

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య సంబంధాలు బలపడిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ముందు మస్క్‌ ప్రపంచ నాయకులతో టెలిఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పలు సలహాలు అందించారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా మారడంతో మాస్క్‌ను అందరూ ‘ఫస్ట్‌ బడ్డీ’గా పిలుస్తుంటారు.

ఈ క్రమంలో స్పేస్‌ ఎక్స్‌కు  చెందిన ఓ భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగాన్ని వీరిద్దరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే, ఇందులో ఒక దశ విఫలమవ్వగా.. రెండో దశ విజయవంతమైంది.  ట్రంప్‌ కేబినెట్‌లో మస్క్ 'ప్రభుత్వ సమర్థత విభాగానికి(అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) నాయకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ప్రచార  సమయంలోనే వెల్లడించాడు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో కలిసి మస్క్ ఈ విభాగానికి అధిపతిగా ఉండనున్నారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)