Breaking News

Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ

Published on Fri, 10/11/2024 - 13:56

బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం  కలకలం రేపుతోంది. సత్‌కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. 

ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం  దుమారం రేపుతోంది.

గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.

ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

స్పందించిన భారత్‌
ఈ పరిణామంపై  భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై  ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన  కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Videos

ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ దద్దరిల్లిన హైదరాబాద్

సంజు దెబ్బకు వైభవ్ అవుట్, టీ 20 ప్లేయింగ్ 11 భారీ మార్పులు

వైభవ్ మాస్ రివెంజ్ తిలక్ కు దిమ్మతిరిగే షాక్

నీకూ అర్చనకు ఎన్ని గొడవలు.. కిట్టు మాట్లాడుతుంటే పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

ఆయన వెళ్లిపోవడం వల్ల ఏం నష్టం లేదు.. బొత్స కొడుకు,కూతురు కౌంటర్

ప్రభాస్ కు KTR ప్రాంక్ కాల్

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

Photos

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)