Breaking News

ప్రాణాలు తీసిన వెయిట్‌ లాస్‌ వ్యామోహం

Published on Thu, 06/15/2023 - 12:45

స్థూలకాయంతో బాధపడుతున్నవారితో పాటు, బరువు పెరిగిపోతున్నామనే భయంతో కొందరు రకరకాల వెయిట్‌ లాస్‌ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా భరిస్తున్నారు. అయితే వెయిట్‌ లాస్‌ వ్యామోహం పెంచుకున్న కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

శరీర బరువు తగ్గాలనే తపనలో 21 ఏళ్ల యువతి తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె 90 కిలోల బరువు తగ్గాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం తీసుకునే ఆహారపానీయాలను ఒక్కసారిగా తగ్గించేసింది. ఖాళీ కడుపుతో వర్క్‌ అవుట్‌ చేస్తున్న సమయంలో ఆమె ఆనారోగ్యం పాలయ్యింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చైనాలోని షాంక్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

షాంఘై మార్నింగ్‌ న్యూస్‌ తెలిపిన వివరాల ప్రకారం చైనా సోషల్‌ మీడియాలో కుయ్‌హువా అనే యువతి ఎంతో ఆదరణ దక్కించుకుంది. ఆమెకు వేలమంది ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. గత శనివారం ఆమె వర్క్‌ అవుట్‌ చేస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

డౌయిన్‌(చైనా టిక్‌టాక్‌ వెర్షన్‌)లో ఆమె తల్లిదండ్రులు ఇలా రాశారు... ‘ మా అమ్మాయి ఇక లేదు. మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు అభినందనలు.  ప్లీజ్‌ మీరంతా ఇలా చేయకండి’ అని రాశారు. కుయ్‌హువా తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అయితే వర్క్‌ అవుట్‌ తరువాతనే ఇలా జరిగిందని తెలిపారు. 

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కుయ్‌హువా భారీ కాయంతో బాధపడుతోంది. దీంతో 90 కిలోల వరకూ బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఒక ఫిట్‌నెస్‌ క్యాంపులో చేరింది. అక్కడ ఆమె ప్రతిరోజూ వర్క్‌ అవుట్‌ చేస్తూ వస్తోంది. కఠినమైన డైటింగ్‌ ఫాలో అయ్యేది. త్వరగా బరువు తగ్గించుకోవాలనే తపనతో ఆహారాన్ని పూర్తిగా మానేసేందుకు కూడా ప్రయత్నించింది. ఈ నేపధ్యంలో ఆమె 25 కిలోల వరకూ బరువు తగ్గింది. 

ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో తెలియజేసింది. అలాగే పలు ఫొటోలను కూడా షేర్‌ చేసింది. రాబోయే 6 నెలల్లో మరో 10 కిలోల బరువు తగ్గాలను కుంటున్నట్లు తెలియజేసింది. అయితే ఈ టార్గెట్‌ పూర్తయ్యేలోగానే ఆమె కన్నుమూసింది. కుయ్‌హువా ఇటీవలి కాలంలో షేర్‌ చేసిన ఫోటోలలో వర్క్‌ అవుట్‌కి సంబంధించిన ఫొటోలే అధికంగా ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఆమె మృతికి సంబంధించిన వార్త వైరల్‌ అవుతుండగా, ఆమె బరువు తగ్గేందుకు అవలంబించిన విధానం సరైనదేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)