Breaking News

భారత పర్యటనకు జర్మన్ ఛాన్స్‌లర్..!

Published on Mon, 01/05/2026 - 23:27

జర్మన్ ఛాన్స్‌లర్‌ ఫ్రీడ్రిక్ మెర్జ్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరును సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇది ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ మొదటి అధికారిక పర్యటన కానుంది.

ఈ జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి, ఛాన్సలర్ మెర్జ్‌కు స్వాగతం పలకనున్నారు. గతేడాది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశం-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలలో సాధించిన పురోగతిని ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి  రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో రక్షణ, భద్రత, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, పరిశోధన, పర్యావరణ, సుస్థిర అభివృద్ధిపై చర్చించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ వ్యాపార, పారిశ్రామిక నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటారు. అత్యున్నత రాజకీయ స్థాయిలో జరిగే సంభాషణల ద్వారా ఈ పర్యటన మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ఇది ఇరు దేశాల ప్రజలకు, విస్తృత ప్రపంచ సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా భవిష్యత్ దృష్టితో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించాలనే భారతదేశం, జర్మనీ సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)