Breaking News

ట్రంప్‌పై మరో తీవ్రమైన అభియోగం

Published on Wed, 08/16/2023 - 01:57

వాషింగ్టన్‌: రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని డొనాల్డ్‌ ట్రంప్‌పై అమెరికా గ్రాండ్‌ జ్యూరీ అభియోగాలు నమోదుచేసింది. మరోసారి అధ్యక్షపీఠంపై కూర్చుకునేందుకు తహతహలాడుతున్న ట్రంప్‌పై అభియోగాలు నమోదవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఫుల్టన్‌ కౌంటీ గ్రాండ్‌ జ్యూరీ సోమవారం తన 41–చార్జ్‌ అభియోగాల పత్రంలో సంబంధిత వివరాలను పొందుపరిచింది.

ట్రంప్‌తోపాటు మరో 18 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చేలా చేసేందుకు తోటి వ్యక్తులు కుట్ర పన్నారని జ్యూరీ పేర్కొంది. ఆగస్ట్‌ 25వ తేదీలోపు ఈ 19 మంది స్వచ్ఛందంగా సరెండర్‌ కావాలని ఫుల్టన్‌ కౌంటీ జిల్లా మహిళా అటార్నీ ఫ్యానీ విల్లీస్‌ సోమవారం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ట్రంప్‌ మాజీ న్యాయవాది రూడీ గిలియానీ, శ్వేతసౌధం మాజీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మిడోస్, అధ్యక్షభవనం మాజీ న్యాయవాది జాన్‌ ఈస్ట్‌మన్, న్యాయశాఖ మాజీ ఉన్నతాధికారి జెఫ్రీ క్లార్క్‌ ఉన్నారు.

రాజకీయ దురుద్దేశం: ట్రంప్‌
‘ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అభియోగాలను అధికార డెమొక్రటిక్‌ పార్టీ నేతలు సమర్థించారు. ‘ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్‌ పన్నిన కుట్రను ఈ అభియోగాలు బట్టబయలుచేస్తున్నాయి’ అని సెనేట్‌ మెజారిటీ లీడర్‌ షూమర్, హౌజ్‌ మైనారిటీ లీడర్‌ హకీమ్‌ అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)