Breaking News

వైరల్‌ వీడియో: బంగ్లాదేశ్‌లో భూకంపం.. భారత్‌ ప్రకంపనలు

Published on Fri, 11/21/2025 - 12:06

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. బంగ్లా రాజధాని ఢాకా (Dhaka)లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (US Geological Survey) తెలిపింది. భూకంపం ప్రకంపనల కారణంగా బంగ్లాదేశ్‌లో పలు భవనాలు కూలిపోయాయి.. దీంతో, ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

వివరాల ప్రకారం.. బంగ్లా రాజధాని ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  పేర్కొంది. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ ప్రకంపనల ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. కోల్‌కతా (Kolkata) సహా ఉత్తర భారతంలో (Northeast India) ప్రకంపనలు నమోదయ్యాయి. 

కోల్‌కతాలో ఉదయం 10:10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌, దక్షిణ్‌, ఉత్తర దినాజ్‌పూర్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గువాహటి, అగర్తల, షిల్లాంట్‌ వంటి నగరాల్లోనూ భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు.

మరోవైపు.. ఈ భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌-ఐర్లాండ్‌ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటు మ్యాచ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)