Breaking News

సైకో భర్త.. భార్యకు మత్తుమందు ఇచ్చి నిద్రపోగానే..

Published on Mon, 06/26/2023 - 21:40

భర్త అంటే జీవితాంతం తన భార్యకు తోడునీడగా కలిసి జీవించాలి అంటారు. దాంపత్య జీవితంలో వచ్చే కష్టనష్టాలను భర్తిస్తూ బతుకు బండిని నడిపించాలి అంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం భర్త అనే పదానికి అర్థమే మార్చేశాడు. తన అర్థాంగిపై ఎవరూ చేయని దారుణానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలియడంతో ఆ మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అసలేం జరిగిందంటే..

వీడు భర్త కాదు శాడిస్ట్‌
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ కి చెందిన డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి‌  తినే అన్నంలో మత్తు మందును  కలిపి ఇచ్చేవాడు. అది తిన్న ఆమె నిద్రలోకి జారుకునేది. ఆమె మత్తులోకి వెళ్లగానే పరాయి పురుషులను తన ఇంటికి పిలిపించి.. తన భార్యపై అత్యాచారం చేయించే వాడు. అంతేకాకుండా వాటిని వీడియోలు కూడా తీసేవాడు ఆ దుర​దుర్మార్గపు భర్త. ఇదే తంతుని ఆమెకు తెలియకుండానే పదేళ్లపాటు నడిపించాడు.  ఈ సమయంలో దాదాపు 92 మంది ఆ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 51 మంది..  26 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిపారు.

 వీరిలో ఫైర్‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టు సహా పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దారుణమైన విషయాన్ని ఫ్రాన్స్ లో ది టెలిగ్రాఫ్ అనే పత్రికలో వెల్లడించారు.   పొగతాగి, మద్యం సేవించి, పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చేవారిని డొమినిక్ అనుమతించేవాడు కాదు. ఎందుకంటే ఆ వాసనతో తన భార్యకు మెలుకువ వచ్చే అవకాశం ఉందని.. తన బండారం బయటపడుతుందని భావించేవాడు. అంతేకాకుండా బండ్లను తన ఇంటి ముందు కాకుండా దూరంగా పార్కింగ్ చేసి రావాలని సూచించేవాడు. 

అసలు నిజం బయటపడిందిలా
అయితే మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరాలతో వీడియోలు తీస్తున్నట్లు అనుమానం రావడంతో డొమినిక్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక విచారణలో అత్యాచార వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్ప‌టికీ డొమినిక్ తో  స‌హా 52 మందిని అరెస్ట్ చేశారు. మరికొంత మందిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.  ఇన్నాళ్లుగా తనపై జరుగుతున్న దారుణాన్ని గురించి తెలుసుకున్న ఆ మహిళ షాకయ్యింది. తన భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.

చదవండి: టైటాన్ జలాంతర్గామి విషాదం.. భర్తతో, కుమారుడితో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుని..

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)