Breaking News

భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!

Published on Mon, 10/28/2024 - 05:56

కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్‌పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో సారా బూన్, భర్త జార్జ్‌ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్‌ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. 

ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్‌ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్‌ ఫోనే ఆమెను పట్టించింది. 

తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్‌ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్‌ తన ఫోన్‌లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్‌ బతిమాలుతుండగా  ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్‌ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్‌లో శిక్ష ఖరారు చేయనుంది. 

– వాషింగ్టన్‌  

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)