కొనసాగుతున్న వరద సహాయక చర్యలు..

Published on Tue, 12/02/2025 - 06:10

జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 708 మంది చనిపోయారని అధ్యక్షుడు ప్రబోవోసుబియాంతో తెలిపారు. 

వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 504 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. గత వారం వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావడం లేదన్నారు. రోడ్లు, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న నార్త్‌ సుమత్ర, వెస్ట్‌ సుమత్ర, ఆసెహ్‌ ప్రావిన్స్‌లను ఆయన సోమవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు. 

అదేవిధంగా, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 181మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో, ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26 వేల మందికి 74 లక్షల డాలర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, శ్రీలంకలో దిత్వా తుపాను సంబంధిత ఘటనల్లో 410 మంది చనిపోగా 336 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం ప్రకటించారు. 

సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కలి్పంచింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో ఫోన్‌లో మాట్లాడారు. దిత్వా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటికే రెండు విడతలుగా ఆహారం, అత్యవసర వస్తు సామగ్రితోపాటు సిబ్బందిని కూడా పంపించడం తెల్సిందే.  

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)