Breaking News

ఫిష్‌ పెడిక్యూర్‌పై విదేశాల్లో నిషేధం

Published on Sat, 10/31/2026 - 12:41

ఫిష్‌ పెడిక్యూర్‌... ఇది బ్యూటీ, కాస్మెటిక్‌ ఇండస్ట్రీలో ఒక దశాబ్దంపాటు రాజ్యమేలిన బ్యూటీట్రీట్‌మెంట్‌. ఇప్పుడది కొన్ని దేశాల్లో నిషేధానికి గురైంది. కారణమేమిటంటే... ఫిష్‌ పెడిక్యూర్‌ అనేక అనారోగ్యాలకు కారణమవుతోంది. ముఖ్యంగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థుల విషయంలో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రాణి ప్రేమికులు కూడా బ్యూటీ స్పా నిర్వాహకులు అవలంబిస్తున్న విధానం మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఆకలితో ఉంచడం అనైతికం!
చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగించడం కోసం బ్యూటీ ఇండస్ట్రీ ఫిష్‌ పెడిక్యూర్‌ని ప్రోత్సహించింది. ఒక నీటి తొట్టెలో గర్రారుఫా ఫిష్‌లను ఉంచుతారు. ఈ చేపలు మధ్యప్రాచ్యంలోని టర్కీ, సిరియా, ఇరాక్, జోర్డాన్‌ వంటి దేశాల్లో లభిస్తాయి. ఇవి నీటిలోని శిలీంధ్రాలను తిని బతికే జీవులు. ఆహారం దొరకనప్పుడు జంతువుల చర్మం మీద ఉండే మృతకణాలను తిని ప్రాణం నిలుపుకుంటాయి. వీటి ఈ అత్యవసర స్థితితో వ్యాపారం చేస్తోంది బ్యూటీ ఇండస్ట్రీ.

ఈ చేపలకు ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచుతారు. ఫిష్‌ పెడిక్యూర్‌ కోసం వచ్చిన వారి పాదాలు కనిపించగానే అవి మృతకణాలను తినడం మొదలు పెడతాయి. మనిషి తన స్వార్థప్రయోజనం కోసం ఒక ప్రాణిని ఆకలితో ఉంచడం అనైతికం. ఇంతకీ ఈ పెడిక్యూర్‌తో పాదాల అందం అమాంతం పెరుగుతుందా? చేపల కారణంగా హాని ఉండదా? అంటే... రెండు సమాధానాలు చెప్పుకోవాలి. వేళ్ల, గోళ్ల సందుల్లో ఉండే మృతకణాలు కూడా తొలగిపోవడంతో చర్మం కాంతివంతంగా మెరిసే మాట నిజమే.

అయితే ఈ ట్రీట్‌మెంట్‌ తర్వాత కొంతమంది గోరు చిగురు మీద చర్మం గాయపడడం, ఆ గాయం మానకపోవడం వంటి సమస్యలనెదుర్కొన్నారు. మామూలు వాళ్లలో ఆ గాయం త్వరగా మానుతుంది. కానీ మధుమేహం, చర్మ సమస్యలున్న వారిలో అనుబంధ సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇన్‌ఫెక్షన్‌లు వస్తున్నాయి!
ఒకరికి ఫిష్‌ పెడిక్యూర్‌ చేసిన తర్వాత తొట్టెలోని నీటిని మార్చాలి, తొట్టెను శుభ్రం చేయాలి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌లు వస్తున్నాయి. ఎగ్జిమా వంటి చర్మవ్యాధి ఉన్న వారికి ఉపయోగించిన చేపలకు కూడా వ్యాధి కారకమైన బ్యాక్టీరియా అంటుతుంది. ఆ చేప ద్వారా వ్యాధి మరొకరికి సంక్రమిస్తోంది. యూరప్‌లో జరిగిన పరీక్షల ద్వారా స్ట్రెప్టోకోకస్‌ అగలాకై్ట గ్రూప్‌–బి అనే బ్యాక్టీరియా ప్రభావం బయటపడింది.

ఈ బ్యాక్టీరియా న్యుమోనియా, ఎముకలు, కీళ్ల ఇన్‌ఫెక్షన్, రక్తసరఫరా ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతుంది. ఫిష్‌ పెడిక్యూర్‌ వల్ల మైకోబ్యాక్టీరియోసిస్‌ రావడానికి కూడా అవకాశముందని యూరప్‌ పరిశీలన నివేదిక వెల్లడిస్తోంది. గర్రా రుఫా జాతి చేప రక్తాన్ని పీల్చదు. కొందరు స్పా నిర్వాహకులు చవకగా లభించే చిన్‌చిన్‌ అనే చైనాకు చెందిన చేపలు వాడుతుంటారు. వాటి గాటు తీవ్రంగా ఉంటుంది. మృతకణాలు భుజించే క్రమంలో అవి కొరికినప్పుడు రక్తం కారుతుంది.

ఆ గాయం ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు దారి తీస్తుంది. అప్పటికే ఆ వ్యక్తి పాదాలకు లోషన్‌ల వంటి సౌందర్యసాధనాలను రాసి ఉంటే చర్మానికి అయిన గాటు నుంచి రసాయనాలు దేహంలోకి ప్రవేశించి తీవ్రమైన పరిణామాలకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌లోని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూ జెర్సీ రాష్ట్రాలు ఫిష్‌ పెడిక్యూర్‌ను పూర్తిగా నిషేధించాయి. కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లలోని ఆరోగ్య విభాగాలు ఈ వ్యాపారం మీద నిషేధాజ్ఞలు జారీ చేశాయి.

ఎక్స్‌ఫోలియేషన్‌(మృతకణాల తొలగింపు)కి ఇంట్లోనే చేసుకోగలిగిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పమిస్‌స్టోన్‌ లేదా శానిటైజబుల్‌ గ్లాస్, సిరామిక్‌ లేదా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫుట్‌ఫైల్స్‌లను సూచిస్తున్నారు. లోషన్‌ల విషయానికి వస్తే ఫ్రూట్‌ యాసిడ్‌లు, లాక్టిక్‌ యాసిడ్‌లు, గ్లైకోలిక్‌ యాసిడ్‌ వంటి నాణ్యమైన సౌందర్యసాధనాలను వాడవచ్చు.
– సాక్షి స్పెషల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: బెండైపోతున్నారా? సింపుల్‌గా ఇలా నిటారవ్వండి!

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)