Breaking News

ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసి

Published on Thu, 11/14/2024 - 08:17

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నేతలకు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక పదవుల పట్టం కడుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్‌ తన నూతన ప్రభుత్వ పాలనావర్గం ఎంపిక ప్రక్రియ జోరు పెంచారు. గతంలో డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలిగా అత్యంత ప్రజాదరణ పొంది ఇటీవల రిపబ్లికన్‌ నేత ట్రంప్‌కు పూర్తి మద్దతు పలికిన తులసీ గబార్డ్‌కు కీలక పదవి దక్కింది. 

అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసీని ఎంపిక చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి హిందూ అమెరికన్‌ మహిళగా తులసీ చరిత్ర సృష్టించారు. ‘‘గత రెండు దశాబ్దాలుగా మన దేశం కోసం, మన అమెరికన్ల స్వేచ్ఛ కోసం తులసి పోరాడారు. గతంలో డెమొక్రటిక్‌ పారీ్టలో పనిచేయడంతో ఈమెకు రెండు పారీ్టల్లోనూ మద్దతుంది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, శాంతిని పరిరక్షిస్తూ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ముందుకు నడిపిస్తారని విశ్వసిస్తున్నా’ అని ట్రంప్‌ పొగిడారు.

ఆర్మీలో పనిచేసి, రాజకీయ నాయకురాలిగా ఎదిగి..  
అమెరికాలోని టుటూలియా ద్వీపంలోని లీలోలా గ్రామంలో 1981 ఏప్రిల్‌ 12న తులసి జని్మంచారు. 21 ఏళ్ల వయసులో తొలిసారిగా హవాయి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2001లో అమెరికాలో 9/11 సెపె్టంబర్‌ దాడుల తర్వాత స్వచ్ఛందంగా ఆర్మీ నేషనల్‌ గార్డ్‌లో చేరారు. 2004లో ఇరాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్‌ ఆఫీసర్‌గా సేవలందించారు. మేజర్‌గా పనిచేసి లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పదోన్నతి పొందారు. 

31 ఏళ్ల వయసులో 2012 పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండో హవాయి కాంగ్రేషనల్‌ జిల్లా నుంచి డెమొక్రటిక్‌ అభ్యరి్థగా గెలిచి తొలిసారిగా పార్లమెంట్‌ దిగువ సభకు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన తులసీ 2020లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం బైడెన్‌తో పోటీపడి చివరకు ని్రష్కమించి ఆయనకే మద్దతు పలికారు. తర్వాత 2022లో డెమొక్రటిక్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.  అయితే తాజా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌’ విధానాలకు ఆకర్షితురాలై ఆగస్ట్‌లో ట్రంప్‌ అనుకూల పోస్ట్‌లు పెట్టి మళ్లీ అందరి దృష్టిలో పడ్డారు. అక్టోబర్‌లో రిపబ్లికన్‌ పారీ్టలో చేరారు. 

టీనేజీలో హిందువుగా మారి.. 
తులసి తల్లి ఇండియానా వాసికాగా, తండ్రికి యూరోపియన్‌ మూలాలున్నాయి. వీళ్లిద్దరికీ భారత్‌తో సంబంధం లేదు. కానీ తులసి తల్లిదండ్రులు 1970వ దశకం నుంచి హిందుత్వాన్ని నమ్ముతున్నారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగా పెంచారు. పార్లమెంట్‌లో భగవద్గీత మీదనే ఆమె ప్రమాణంచేశారు. తులసి తండ్రి మైక్‌ గబార్డ్‌ సైతం రాజకీయనేతే. ఆయన హవాయ్‌ సెనేటర్‌గా గతంలో పనిచేశారు.

18 నిఘా సంస్థల సమన్వయంతో రోజూ బ్రీఫింగ్‌ 
అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌తో కలిసి తులసి నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా కీలకమైన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతి రోజూ ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్‌కు తాజా సమాచారంపై బ్రీఫింగ్‌ ఇవ్వాలి. అమెరికా విదేశాంగ విధానాలను, విదేశాల్లో అమెరికా అతిసైనిక జోక్యాన్ని తప్పుబట్టిన తులసి తాజా పదవిలో ఏమేరకు రాణిస్తారో వేచిచూడాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)