Breaking News

తనను తాను డెలివరీ చేసుకుంది!

Published on Sun, 06/29/2025 - 04:32

కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన వస్తువు చిటికెలో డోర్‌ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ కస్టమర్‌ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్‌ ఉన్న లొకేషన్‌కు భద్రంగా చేరుకుంది. 

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్‌ కారు ‘మోడల్‌ వై’ను టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్‌ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్‌ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. 

ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్‌ క్యామ్‌’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు తమ అటానమస్‌ కారు డెలివరీని ఎలాన్‌ మస్క్‌ ‘ఎక్స్‌’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. 

తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్‌ ఆపరేటింగ్‌ లేకుండా ఒక పబ్లిక్‌ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్‌ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్‌వేర్, ఏఐ చిప్‌ డిజైన్‌ బృందాలను ఆయన అభినందించారు. మోడల్‌ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్‌ విభాగం చీఫ్‌ అశోక్‌ ఎల్లుస్వామి వెల్లడించారు.      – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)