Breaking News

భారత అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం

Published on Tue, 02/04/2025 - 10:11

వాషింగ్టన్‌: అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే కార్యక్రమం అమెరికాలో నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా.. 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరినట్లు తెలుస్తోంది. మరో 24 గంటల్లో విమానం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.  ఈ ప్రక్రియకు ఢిల్లీ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం.

ఇంతకు ముందు.. వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌ విషయంలో మాత్రం ఇదే తొలి అడుగు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. 

అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్‌ సెంటర్‌ అంచనా. మెక్సికో, ఎల్‌ సాల్వడోర్‌ తర్వాత అత్యధికంగా ఉంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ & కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టిన వెంటనే అమెరికా భూభూగంలో ఉన్న అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే తీరతానని ట్రంప్‌ ప్రతినబూనారు. అలాంటి వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. ఇదే అంశంపై ట్రంప్‌ గతంలో మోదీతోనూ ఫోన్‌లో మాట్లాడారు.  ఆ టైంలో  ‘‘సరైన చర్యలు తీసుకుంటాం’’ అని భారత ప్రధాని తనతో అన్నారని ట్రంప్‌ తమ చర్చల సారాంశాన్ని వివరించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)