Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం

Published on Mon, 12/29/2025 - 13:03

జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని ‘కాసిహ్ సయాంగ్’ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో  ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని’ ఆయన వివరించారు.

ప్రమాదం నుంచి బయటపడిన 15 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స  కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వంటగదిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. వృద్ధాశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జకార్తా తాత్కాలిక గవర్నర్ హెరు బూడి హర్తోనో సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)