Breaking News

ట్రంప్‌కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్‌ ఐదున ప్రదానం

Published on Fri, 11/07/2025 - 13:48

న్యూఢిల్లీ: ‘శాంతి బహుమతి’ కోసం తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కల త్వరలో నెరవేరబోతోంది. అయితే అది నోబోల్‌ నుంచి కాదు. మరో ప్రముఖ సంస్థ ఆయనను ‘శాంతి బహుమతి’తో సత్కరించనున్నట్లు సమాచారం. పైగా ఈ పురస్కారం అందుకునే తొలి ప్రముఖుడు ట్రంప్‌ అంటూ ఆ సంస్థ అధ్యక్షుడు పరోక్షంగా ప్రకటించారు. ఇంతకీ అది ఏ సంస్థ?.. ఎందుకు  ట్రంప్‌కు శాంతి బహుమతి ఇస్తున్నారనే వివరాల్లోకి వెళితే..

అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య(ఫిఫా) త్వరలో తమ సంస్థ నుంచి ‘శాంతి బహుమతి’ని అందించాలని నిర్ణయించింది. దీనికి ‘ఫిఫా శాంతి బహుమతి’గా నామకరణం చేసింది. ప్రపంచంలో శాంతి, ఐక్యతల కోసం విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి, వారికి ‘ఫిఫా’ ఈ ‘శాంతి బహుమతి’ని ప్రదానం చేయనుంది. 2025, డిసెంబర్ ఐదు (శుక్రవారం)న వాషింగ్టన్ డీసీలో జరిగే 2026 ప్రపంచ కప్ డ్రా సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో  తన చేతుల మీదుగా ఒక ప్రముఖునికి ‘ఫిఫా శాంతి బహుమతి’ని అందించనున్నారు.

‘ఫిఫా’ తెలిపిన వివరాల ప్రకారం శాంతి కోసం విశేషంగా కృషిచేసి, ప్రపంచ ప్రజలను  ఏకంచేసిన ప్రముఖుడు ఈ బహుమతిని అందుకోనున్నారు.
‘అస్థిరత, విభజనలు పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో, సంఘర్షణలను అంతం చేయడానికి, శాంతియుత స్ఫూర్తితో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసే వారి అత్యుత్తమ సహకారాన్ని గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఇన్ఫాంటినో అన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధం కలిగిన ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో.. అమెరికా బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్బంగా విలేకరులు.. ‘ఈ బహుమతి తొలిసారిగా ట్రంప్  అందుకోబోతున్నారా?’ అని అడిగారు. దీనికి సమాధానంగా ఆయన ‘డిసెంబర్ 5న మీరంతా చూస్తారు’ అని అన్నారు.  బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్‌ ప్రసంగం అనంతరం ఇన్ఫాంటినో అదే వేదికపై మాట్లాడారు. ట్రంప్‌ను ప్రపంచ శాంతి సాధనలో ఛాంపియన్‌గా తాను చూస్తున్నానని ఇన్ఫాంటినో  పేర్కొన్నారు. గాజాలో శాంతి ఒప్పందం కోసం ట్రంప్ చేసిన కృషికి గాను ఈ అవార్డుకు   ఆయన ఖచ్చితంగా అర్హుడు అని ఇన్ఫాంటినో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో రాశారు. 

ఇది కూడా చదవండి: Air India Crash: ‘పైలట్‌ను నిందించొద్దు’: సుప్రీంకోర్టు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)