Breaking News

స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత

Published on Thu, 09/03/2026 - 16:31

న్యూయార్క్‌: ప్రఖ్యాత రచయిత్రి, ఫెమినిస్ట్‌   గ్లోరియా స్టీనిం (Gloria Steinem)ఇకలేరు.  అమెరికా మహిళా ఉద్యమానికి శక్తివంతమైన గొంతుకగా నిలిచిన ఆమె  92  ఏళ్ల వయసులో న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. జీవితాంతం స్త్రీవాద ఆశయాల కోసం పోరాడిన ధీర ఆమె. ఆమె మరణంపై పలువురు మహిళా జర్నలిస్టులు, రచయితలు సంతాపం ప్రకటించారు.

1968లో ఆమె 'న్యూయార్క్ మ్యాగజైన్' సహ-స్థాపకురాలిగా ఉన్నారు. ఆ తర్వాత 1972లో  మహిళల యాజమాన్యంలో, మహిళల కోసం  నడిచిన తొలి   పత్రిక 'Ms.' మ్యాగజైన్‌ను ప్రారంభించిన ఘనత ఆమె సొంతం.  మహిళల హక్కుల కోసం ఆమె చేసిన నిరంతర కృషికిగాను, 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' (Presidential Medal of Freedom)  పురస్కారాన్ని అందుకున్నారు.  సామాజిక భావాలపై పలు పుస్తకాలు రాశారు.

దాదాపు శతాబ్దం ఈ భూమిపై ఎంతో సార్థక జీవితాన్ని గడిపారు.ఆమె చివరి శ్వాస వరకు సమానత్వం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. తనను ప్రేమించే ఎందరో ప్రముఖుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశారని  గ్లోరియా ఫౌండేషన్‌ ఇన్‌స్టాలో ప్రకటించింది.

 పర్వతానికి అవతలి వైపు దారి చూపడానికి కొండలపై సంకేత అగ్నులు వెలిగించే సంప్రదాయం గ్లోరియాకు చాలా ఇష్టం. గ్లోరియా కోసం  పుష్పాలకు బదులుగా, బహుమతితో తనను గౌరవించాలనుకునే వారు గ్లోరియా ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వాలంటూ గ్లోరియా  కోరుకున్నారంటూ ఒక సంతాప సందేశాన్ని పోస్ట్‌చేశారు.

ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు


గ్లోరియా తన రాబోయే పుస్తకం, 𝘈𝘯 𝘜𝘯𝘦𝘹𝘱𝘦𝘤𝘵𝘦𝘥 𝘓𝘪𝘧𝘦 లో  రాసిన వ్యాక్యాలను కూడా ఈ సందేశంలో పొందుపర్చారు.  “నేను ఇప్పుడు యాభై సంవత్సరాలకు పైగా ఈ బ్రౌన్‌స్టోన్‌లో నివసిస్తున్నాను; నాకంటే ముందు ఎన్నో జీవితాలకు సాక్ష్యంగా నిలిచిన గదులలో, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతరుల జీవితాలను చూడబోతున్నాను.” ఈ పుస్తకం, అలాగే తన ఇంటిని సామాజిక న్యాయ ఉద్యమాలకు కేంద్రంగా మార్చాలనే ఆమె నిబద్ధత, రాబోయే తరాలపై ప్రభావం చూపుతాయనే ఆశతో గ్లోరియా ప్రపంచానికి అందించిన అనేక కానుకలలో కొన్ని అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్‌ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)