Breaking News

Israel-Hamas War: ఫౌదా సిరీస్ నటుడికి తీవ్ర గాయాలు

Published on Tue, 01/09/2024 - 13:46

టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు, నటుడు ఇదాన్ అమేదీ తీవ్రంగా గాయపడ్డారు. గాజాలో నిర్వహిస్తున్న భూతల దాడుల్లో ఆయన తీవ్రంగా గాయాలపాలైనట్లు ఇజ్రాయెల్ దౌత్యవేత్త అవియా లెవీ వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే.

యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఇదాన్ అమేదీ సైన్యంలో చేరారు. అప్పట్లో ఓ పోస్టు కూడా పెట్టాడు. ఫౌదాలో ఇది దృశ్యం కాదు.. నిజ జీవితం అని రాసుకొచ్చాడు. ఇజ్రాయెల్ సైన్యం ఎదుర్కొంటున్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకుని ఫౌదా సిరీస్‌ను కూడా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది మంచి ప్రజాధరణ పొందింది.

గత ఏడాది అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధంలో ఇప్పటికే హమాస్ వైపు 22 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇజ్రాయెల్ వైపు 1100లకు పైగా మరణించారు. యుద్ధం ప్రారంభంలోనే ఇజ్రాయెల్ మూడు లక్షల రిజర్వు సైన్యాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇదాన్ అమేదీతో పాటు ఈ ఫౌదా సిరీస్‌లో నటించిన లియర్ రాజ్ కూడా యుద్ధంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:  India-Maldives Controversy: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)