Breaking News

‘బాలాకోట్‌’ బిర్యానీ.. ‘షెహబాజ్‌’ షర్బత్‌! 

Published on Fri, 10/10/2025 - 06:16

అవాక్కయ్యారా!.. ఈ పేర్లన్నీ మన బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ (2019), ఇటీవల జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌లో భారత్‌ దెబ్బ తగిలిన పాకిస్థాన్‌ ప్రాంతాల పేర్లే కదూ అనిపించిందా! మన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ 93వ వార్షికోత్సవం సందర్భంగా, ఒక ఫేక్‌ మెనూ సోషల్‌ మీడియాలో వైరలైంది.. దేశం మొత్తం గట్టిగా నవ్వుకునేలా చేసింది! ఈ మెనూని తయారుచేసింది ఎవరో కాదు, మన ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ). ఈ ఏఐకి, ఆ మెనూ పేర్లు పెట్టిన మన సైనికులకు పద్మశ్రీ ఇవ్వొచ్చు!. మెనూ చూడగానే, ’అమ్మో! ఎంత ఘాటుగా ఉందో!’ అనిపించేలా ఉంది. ఆ మెనూలో ఉన్న పేర్లు చదివితే, మనోళ్లు మామూలోళ్లు కాదు సుమీ.. అనిపించక మానదు. ఆ మెనూలో పాకిస్థాన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారంతే..! ఇవి చదివాక.. ’ఆహో! వంటకాల పేర్లలో కూడా మన సైన్యం సత్తా చాటిందే!’ అనుకున్నారంతా. 

బహావల్పూర్‌ నాన్‌.. రావల్పిండి చికెన్‌ టిక్కా మసాలా 
మెయిన్‌ కోర్సుగా బహావల్పూర్‌ నాన్, రావల్పిండి చికెన్‌ టిక్కా మసాలా పెట్టారు.. వారి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్టు.. మురిద్కే, ముజఫరాబాద్‌ పేర్లతో చేసిన డెసర్ట్‌లు వడ్డించారు. ‘మా విందులో మీకు ఘాటుగా టిక్కా మసాలా ఉంది, తీయగా తిరామిసు ఉంది. కానీ మాకు మాత్రం... మీ టెర్రర్‌ క్యాంపులు నాశనం చేసిన కిక్‌ ఉంది!’ అన్నట్టుగా ఉంది ఈ ఫేక్‌ మెనూ వెనుక ఉన్న ‘పకడ్బందీ ప్లాన్‌’! ఈ మెనూ చూసి సైనికులు, ఆర్మీ వెటరన్స్‌ కూడా పగలబడి నవ్వారంటే, దీని పవర్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు!

మన సైనికుల సెటైర్‌ సూపరెహే.. 
‘షెహబాజ్‌’ అంటే.. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ను ఆడుకోవడం. ఇక, ‘రఫీఖీ’ అనేది పాకిస్థాన్‌లోని ఓ ముఖ్యమైన ఎయిర్‌ బేస్‌ పేరు. ఆపరేషన్‌ సింధూర్‌లో మన సైన్యం ఆ ఎయిర్‌ బేస్‌ను కూడా దెబ్బ కొట్టింది. అంటే, ‘షెహబాజ్‌ గారూ.. మీ రఫీఖీ బేస్‌ను కొట్టేశాం’.. అని గాలిలోనే సరదాగా వారి్నంగ్‌ ఇచ్చినట్టు ఉందీ వ్యవహారం. ఏఐ పుణ్యమా అని వైరలైన ఈ ఫేక్‌ మెనూ, సరదాగా చేసిన ఈ విమానాల నామకరణం చూస్తే.. మన సైనికుల ఫైటింగ్‌ స్పిరిట్‌ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు యుద్ధంలోనే కాదు, సెటైర్‌ వేయడంలోనూ దిట్ట!. మరి ఈ ఫన్నీ మెనూ చూశాక మీకేం అనిపించింది?.. మీరూ.. కొత్త ‘శత్రువుల కడుపు మంట’ వంటకాలు కనిపెట్టారా?

విమానాలకు కూడా ‘పేరు’! 
ఇక, విందు మెనూతో పాటు, అంతకంటే ఫన్నీగా జరిగిన ఇంకో విషయం ఉంది. ఐఏఎఫ్‌ డేకి ముందు.. ఆకాశంలో కనిపించిన రెండు విమానాలకు పెట్టిన సంకేత నామాలు చూస్తే, ఇక నవ్వు ఆపుకోవడం ఎవరి వల్లా కాదు. 
ఇ130ఒ విమానం సంకేత నామం: ‘రఫీఖీ’  
అn32 విమానం సంకేత నామం: ‘షెహబాజ్‌’

– న్యూఢిల్లీ  

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)