Breaking News

ట్రంప్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. యూరప్‌లో ఉద్రిక్తత?

Published on Wed, 12/10/2025 - 07:49

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. యూరోపియన్ అనుసరిస్తున్న విధానాలు విపత్తులను సృష్టించేవిగా ఉన్నాయని ట్రంప్‌ ఆరోపించారు. ‘పొలిటికో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ చేసిన ఈ విమర్శలు ఇప్పుడు అమెరికా, దాని కీలక మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

నాటో కూటమిపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ఈ కూటమి తనను డాడీ అని పిలుస్తుందని పేర్కొంటూనే, రక్షణ వ్యయంపై యూరోపియన్ దేశాలు  ఏవోవో మాట్లాడతాయి తప్ప, యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అవసరమైన సహాయాన్ని అందించవని ట్రంప్ ఆరోపించారు. రష్యాకు కైవ్ భూభాగాన్ని అప్పగించాల్సి వస్తుందని, యూరప్‌లోని చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించాలనే యూఎస్‌ ప్రణాళికపై పెరుగుతున్న విభేదాల సమయంలో ఈ వ్యాఖ్యలు  కలకలం సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుపై యూరోపియన్ నేతలు ట్రంప్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ విమర్శలు వెలువడ్డాయి.

ఈ సందర్భంలోనే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మార్షల్ లా కారణంగా ఎన్నికలు వాయిదా పడటం వల్ల దేశం ‘ఇకపై ప్రజాస్వామ్యం కాదు’ అనే స్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. అందుకే రష్యా పైచేయి సాధిస్తోందని ఆయన వాదించారు. యుద్ధాన్ని ముగించడానికి తాను రూపొందించిన ప్రణాళికను గ్రహించి, యుద్ధంలో మరణాలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని ఆయన జెలెన్స్కీకి ట్రంప్‌ సలహా ఇచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, జెలెన్స్కీ మాట్లాడుతూ భద్రతను నిర్ధారించగలిగితే తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వలసల అంశంపై ట్రంప్ చేసిన విమర్శలు ఇటీవల విడుదల చేసిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలోని అంశాలను బలపరుస్తున్నాయి.  వలసల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్ , జర్మనీ తదితర దేశాలు నాశనం అవుతున్నాయని ట్రంప్  ఆరోపించారు. యూరప్‌లోని నేతలు వలసల ప్రభావాన్ని సమర్థవంతంగా  నిర్వహించడంలో విఫలమయ్యారని ట్రంప్‌  ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Israel: యుద్ధ విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న గణాంకాలు 

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు