Breaking News

ట్రంప్ పన్నులపై భగ్గుమన్న నాటోదేశాలు

Published on Sun, 01/18/2026 - 11:22

 గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై తాజాగా  ఈయూ ఫారెన్‌ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ స్పందించారు. మిత్ర దేశాల మధ్య వైరం వల్ల పరోక్షంగా రష్యా-చైనాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని తెలిపారు.

డెన్మార్క్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న  ఎనిమిది దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. అయితే  ఈ అధిక పన్నులను ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దీనిపై మాట్లాడుతూ ట్రంప్ బెదిరింపులు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ అంశంపై ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్ ఎక్స్‌లో స్పందించారు.
      

ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ     "మిత్రులమధ్య వైరం వల్ల చైనా, రష్యాలు లబ్ధిపొందే అవకాశం ఉంది. గ్రీన్‌లాండ్ భద్రత     ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. దానిని నాటోలో అంతర్గతంగా చర్చించుకోవాలి. ఈ అధిక పన్నుల వల్ల యూరప్ దేశాలతో పాటు అమెరికా పేదదేశంగా  మారే అవకాశం ఉంది". అని ఆమె అన్నారు. అదేవిధంగా ఈ అంశం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సహయాన్ని పక్కదారి పట్టించేదిగా ఉండకూడదన్నారు.

అయితే గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఎనిమిది దేశాలు, డెన్మార్క్,     నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్  దేశాలపై ట్రంప్ 10 శాతం పన్నులు విధించారు. ఫిబ్రవరి 10 నుంచి అది అమలులోకి వస్తుందని తెలిపారు. దీనిపై ఆ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)