Breaking News

బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

Published on Sat, 02/21/2026 - 14:02

ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఎరిక్ డేన్ (Eric Dane) అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. అయితే అరుదైన వ్యాధితో  చనిపోవడానికి ముందు తన ఇద్దరు కుమార్తెలు (బిల్లీ, జార్జియా) కోసం రాసిన భావోద్వేగపూరితమైన సందేశం నెట్టింట వైరల్‌గా మారింది.  ఈ సందేశాన్ని విన్న తరువాత కన్నీళ్లు పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఎరిక్ డేన్ తన జీవితంలోని ఒడిదుడుకులు, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసవ్వడం, డిప్రెషన్ వంటి సమస్యల నుండి కోలుకున్న తర్వాత ‘‘లెటర్స్ టు మై డాటర్స్" (Letters to My Daughters) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా తీవ్రమైన భావోద్వేగంతో  తన ఇద్దరు కుమార్తెలకు  కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, తమకు తాము నిజాయితీగా ఉండాలని  కోరారు. తాను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు, కానీ నా తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నానన్నారు. తన పిల్లలు కూడా తప్పులు చేయడానికి భయపడ కూడదని హితవు పలికారు. తను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని, వారి ఎదుగుదలలో తండ్రిగా గర్వపడతానని చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. లోకం ఏమనుకున్నా సరే, తమ స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని ఆయన వారికి సూచించారు.

కన్నీళ్లు పెట్టించే ఎరిక్‌డేన్‌ ఏమోషనల్‌ మెసేజ్‌ 
‘‘వర్తమానంలో జీవించండి.ఇప్పుడే, ఈ క్షణమే. మీ దగ్గర ఉన్నదల్లా ఈ వర్తమానమే. దానిని నిధిలా దాచుకోండి. ప్రతి క్షణాన్ని ప్రేమగా ఆస్వాదించండి. ప్రేమలో పడండి. అది కేవలం ఒక వ్యక్తితో  కాకపోవచ్చు (అది కూడా మంచిదే అనుకోండి). కానీ ఏదో ఒక దానితో ప్రేమలో పడండి. మీ అభిరుచిని, మీ సంతోషాన్ని వెతుక్కోండి. మిమ్మల్ని ఉదయాన్నే నిద్రలేపేలా చేసే, రోజంతా ఉత్సాహంగా నడిపించే ఒక లక్ష్యాన్ని కనుగొనండి. అమ్మ, మీరు ఎన్నో ప్రదేశాలు చూశాం. ఎన్నో బీచ్‌ల్లో గంటల తరబడి సంతోషంగా గడిపాం.​ ఆ క్షణాలు ఎప్పటికీ నాతోనే.

స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ మనస్తత్వానికి తగ్గ వ్యక్తులను వెతకండి, వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా ఉండండి. ఆపై వారికి అంకితమవ్వండి. ఎటువంటి తీర్పులు, షరతులు, ప్రశ్నలు ఉండని నిజమైన స్నేహితులు మీకు తిరిగి అంతే ప్రేమను ఇస్తారు. మీ స్నేహితుల్ని ప్రేమించండి.వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు..నవ్విస్తారు. సాయం చేస్తారు..మార్గనిర్దేశం  చేస్తారు. కొంతమంది మిమ్మల్ని కాపాడతారు.

మీలోని ప్రతి అణువుతో, ఆత్మగౌరవంతో పోరాడండి. మీకు అనారోగ్యం లేదా మరేదైనా సవాళ్లు ఎదురైనప్పుడు, పోరాడండి. ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీ చివరి శ్వాస వరకు పోరాడండి. ఈ వ్యాధి నా శరీరాన్ని నెమ్మదిగా హరిస్తోంది కావొచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయ లేదు.

మీరు దేనినైనా ఎదుర్కోగలరని, మీ జీవితం ముగిసిపోవచ్చని, నరకాన్ని కూడా గౌరవంగా ఎదుర్కోగలరని నేను నిరూపించానని ఆశిస్తున్నాను. మై డియర్‌  బిల్లీ, జార్జియా, మీరే నా హృదయం, మీరే నా సర్వస్వం. తలెత్తుకుని పోరాడండి. శుభరాత్రి. ఐ లవ్‌ యూ’’ అంటూ ఇచ్చిన సందేశం ఆయన మరణం తరువాత విడుదలైంది. ఇది  పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.

 మరోవైపు  డేన్‌ స్నేహితులు , మద్దతుదారులు  ALS తో పోరాడుతూ మరణించిన డేన్ భార్య రెబెక్కా, ఇద్దరు టీనేజ్ కుమార్తెలు, బిల్లీ, జార్జియా కోసం GoFundMe ప్రచారం ప్రారంభించారు. లాస్ ఏంజిల్స్‌లోని "ఫ్రెండ్స్ ఆఫ్ ది డేన్ ఫ్యామిలీ"  ‘ఇన్ హానర్ ఆఫ్ ఎరిక్ డేన్’ అనే పేరుతో ఈ ప్రచారానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు  రూ.1.07 కోట్లనిధులను సేకరించారు.  మొత్తం 2.27 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

కాగా అమెరికన్ టీవీ సిరీస్ గ్రేస్ అనాటమీ (Grey's Anatomy) లో డాక్టర్ మార్క్ “McSteamy” స్లోన్ పాత్రతో విశేష గుర్తింపు  పొందిన ఎరిక్ డేన్ 53  ఏళ్లకే  (2026 ఫిబ్రవరి 19న) చనిపోవడంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనేది  ప్రొగ్రెసివ్‌ న్యూరోడీజెనరేటివ్ వ్యాధి.ప్రస్తుతం దీనికి చికిత్స లేదు.

తన మరణానికి ముందు, ఎరిక్ డేన్ తాను మరణించిన తర్వాతే ఈ విషయం ప్రపంచంతో పంచుకుంటాడనే అవగాహనతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ALS తో తన పోరాటం, వ్యసనంతో తన పోరాటాలు, రెబెక్కా గేహార్ట్‌తో  ప్రేమతదితర విషయాలు పంచుకున్నాడు. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)