Breaking News

ట్విట్టర్‌ పక్షులకు వీడ్కోలు చెప్పేస్తా

Published on Mon, 07/24/2023 - 04:03

న్యూయార్క్‌:  ట్విట్టర్‌.. ఈ సోషల్‌ మీడియా వేదిక గురించి తెలియని నెటిజన్లు ఉండరు. నీలి రంగు ట్విట్టర్‌ పిట్ట అందరికీ సుపరిచితమే. ఈ పిట్ట ఇకపై కనిపించదు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ యజమాని, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ స్వయంగా ప్రకటించారు. తమ యాప్‌ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. ట్విట్టర్‌ను రీబ్రాండ్‌ చేయనున్నట్టు తెలియజేశారు. చైనాకు చెందిన వియ్‌చాట్‌ తరహాలో అన్నింటికీ పనికొచ్చే ‘ఎక్స్‌’ యాప్‌ను రూపొందించాలని ఆయన కొంత కాలంగా యోచిస్తున్నారు. ఇది కేవలం సోషల్‌ మీడియా వేదికగానే కాకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులకు, ఆహారాన్ని ఆర్డర్‌ చేయడానికి పనికొస్తుంది.

చాలా రకాల సేవలు అందించేలా ఎక్స్‌ యాప్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్‌ను త్వరలో ‘ఎక్స్‌’ యాప్‌గా రీబ్రాండ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘త్వరలోనే మేం ట్విట్టర్‌ బ్రాండ్‌కు.. ఆ తర్వాత క్రమంగా నీటి రంగు ట్విట్టర్‌ పక్షులకు వీడ్కోలు పలుకనున్నాం’ అని ఎలాన్‌ మస్క్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఎక్స్‌ యాప్‌నకు కొత్త లోగోను సూచించాలని ఆయన కోరారు. ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. సంస్థలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్‌ బిజినెస్‌ పేరును ఎక్స్‌ కార్పొరేషన్‌గా మార్చారు. ట్విట్టర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్స్‌ కార్పొరేషన్‌లో చట్టబద్ధంగా విలీనమైంది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)