Breaking News

సిగ్గు చేటు.. ట్రూడోపై మస్క్‌ ఆగ్రహం

Published on Mon, 10/02/2023 - 08:12

శాన్‌ఫ్రాన్సిస్కో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడోపై ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో స్వేచ్ఛా హక్కును ట్రూడో ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారాయన. 

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవల నియంత్రణ కోసం కెనడా ప్రభుత్వం ఈ మధ్యే కొత్త రూల్‌ తెచ్చింది. దాని ప్రకారం.. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ తప్పనిసరిగా  ప్రభుత్వ పరిధిలో రిజిస్టర్‌ చేసుకోవాలని రూల్‌ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మస్క్‌ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

ఈ నిబంధనలపై ఓ జర్నలిస్ట్‌, మస్క్‌ను ప్రశ్నించారు. దీనిపై ఎక్స్‌ ద్వారా ఘాటుగానే ఎలన్‌ మస్క్‌ స్పందించారు. సిగ్గు చేటు అని ట్రూడో సర్కార్‌పై మండిపడ్డారు. 

ఇదిలా ఉంటే.. వాక్ స్వేచ్ఛను  అణచివేస్తోందన్న ఆరోపణలు ట్రూడో ప్రభుత్వం ఎదుర్కోవడం  కొత్తేం కాదు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ట్రక్కు డ్రైవర్ల నిరసనలను అణగదొక్కేందుకు అత్యవసర అధికారాన్ని ఉపయోగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 

తాజాగా ఖలీస్తానీ టెర్రరిస్ట్‌ హర్దీప్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి కూడా. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)