Breaking News

కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై మస్క్‌ విమర్శలు

Published on Sun, 06/29/2025 - 12:58

వాషింగ్టన్‌: అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు  చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది.  ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్‌ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్‌ ద్వారా మస్క్‌ ట్వీట్‌ చేశారు.   

వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్‌’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్‌ను మస్క్‌ తప్పుబట్టారు. తాజా సెనేట్‌ డ్రాఫ్ట్‌ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్‌ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు.  

ఇంతకుముందు కూడా హౌస్‌లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,ఎలాన్‌ మస్క్‌ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్‌ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్‌ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు.   ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్  ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 

ట్రంప్‌ సైతం మస్క్‌ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్‌ తీరు ఇలాగే కొనసాగితే  మస్క్  వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్‌ మస్క్‌ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)