Breaking News

వీడ్కోలు వేళ ఎలాన్‌ మస్క్‌ ముఖంపై గాయం.. ఏం జరిగింది?

Published on Sat, 05/31/2025 - 08:09

వాషింగ్టన్‌: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ వీడ్కోల వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మస్క్‌ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్‌ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్‌ మస్క్‌ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్‌ కార్యాలయానికి ఎలాన్‌ మస్క్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మస్క్‌ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్‌ను ప్రశ్నించారు.

ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ఈ గాయం నా కుమారుడు చేసింది. నేను, నా ఐదేళ్ల కుమారుడు X Æ A-Xii బీచ్‌లో గుర్రపు స్వారీ చేస్తున్నాం. ఈ క్రమంలో అతడు నా ముఖంపై ఒక పంచ్‌ ఇచ్చాడు. దీంతో, అక్కడ గాయం ఏర్పడింది. ఆ సమయంలో దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా? అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్‌ సైతం స్పందిస్తూ.. ఇన్ని రోజులు తాను కూడా గాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. కానీ, మస్క్‌ కుమారుడు అలా చేయగలడు అని అన్నారు. ఇక, ట్రంప్‌, టెక్‌ మాగ్నెట్‌ కుమారుడే X Æ A-Xii.

అయితే, ఎలాన్‌ మస్క్‌ కొన్ని రకాల డ్రగ్స్‌ వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా? అని మస్క్‌ను విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాస్క్‌ స్పందిస్తూ.. అది తప్పుడు కథనం అంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ, మస్క్‌ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉండగా.. వీడ్కోలు సందర్బంగా ట్రంప్‌.. మస్క్‌కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్‌ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో మస్క్‌ సేవలను ట్రంప్‌ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్‌ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్‌ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.

స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా..
డోజ్‌కు వీడ్కోలు సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్‌ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్‌నకు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్‌’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్‌ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్‌’కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్ట్‌ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్‌ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)