Breaking News

బిడ్డ భ‌విష్య‌త్తు కోసం..

Published on Fri, 08/22/2025 - 17:57

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం శ‌క్తిమేర‌కు కూడ‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు త‌మ వార‌సుల‌కు ఇచ్చేందుకు క‌ష్ట‌ప‌డుతుంటారు. దుబాయ్‌కు చెందిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ జంట త‌మ పసిపాప కోసం అపురూప కానుక‌ను సిద్ధం చేసింది. ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వనంగా పేరు గ‌డించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. త‌మ పాప భ‌విష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో వీరిపై నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

దుబాయ్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభ‌ర్త‌లు. ఐకానిక్ బిల్డింగ్‌ బుర్జ్ ఖలీఫాలో త‌మ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ పాప‌తో క‌లిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే ఈ వీడియోకు 5 ల‌క్ష‌ల‌కుపైగా వ్యూస్‌, 26 వేల‌కు పైగా లైకులు వ‌చ్చాయి. పెద్ద‌య్యాక త‌మ కూతురికి ఆర్థిక స‌మ‌స్య‌లు లేకుండా చేయాల‌న్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామ‌ని నోరా వెల్ల‌డించారు.

త‌మ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్‌తో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశామ‌ని, త‌మ బిడ్డ పెద్ద‌య్యే నాటికి మొత్తం చెల్లించేస్తామ‌ని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన త‌ర్వాత అద్దెకు ఇస్తామ‌ని, త‌మ కూతురు పెద్దైన త‌ర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుంద‌న్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబ‌ట్టి దీని విలువ భ‌విష్య‌త్తులో బాగా పెరుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూసిన నెటిజ‌నులు.. నోరా, ఖలీద్ దంప‌తుల‌ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒక‌రు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్నారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)