Breaking News

ఓ ఆంటీ.. పులితో ఆటా.. తేడా కొట్టిందో..!!

Published on Tue, 10/12/2021 - 13:37

దుబాయ్‌: మన దగ్గర లింగ నిర్థారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. కానీ కొన్ని దేశాల్లో ఇది చట్టబద్దం. డెలివరీకి ముందే పుట్టబోయేది ఆడ, మగ అనేది వెల్లడిస్తారు వైద్యులు. ఈ క్రమంలో విదేశాల్లో జెండర్‌ రీవిలింగ్‌ పార్టీలు జరుగుతుంటాయి. దీనిలో రెండు రంగులను వాడతారు. పింక్‌ ఆడపిల్లను సూచిస్తే.. బ్లూ.. మగపిల్లాడిని సూచిస్తుంది. సన్నిహితులు, స్నేహితులు మధ్య ఎంతో సంతోషంగా ఈ పార్టీని జరుపుకుంటారు.


                              జెండర్‌ రివీల్‌ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పుడు ఈ జెండర్‌ రివీల్‌ పార్టీ గురించి ఎందుకంటే.. తాజాగా దుబాయ్‌లో జరిగిన జెండర్‌ రివీల్‌ పార్టీ వివాదాస్పదంగా మారింది. ఈ పార్టీలో సదరు కుంటుంబం జెండర్‌ని వెల్లడించడం కోసం నిజమైన పులిని వాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. 
(చదవండి: ఆకాశాన్ని తాకే అద్భుతాలు.. ఇవి తెలుసా?)


                                             జెండర్‌ రివీల్‌ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)

దుబాయ్‌కు చెందిన ఓ జంట బుర్జ్‌ అల్‌ అరబ్‌ హోటల్‌లో జెండర్‌ రివీల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సదరు జంట పార్టీకి పులిని తీసుకువచ్చారు. ఇక దాన్ని బంధించకుండా.. ఉరికే వదిలేశారు. ఇక ఆ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ ఆడో, మగో చెప్పడం కోసం గాల్లోకి బెలూన్‌లు ఎగరవేయసాగారు. 
(చదవండి: పెగాసెస్‌: ప్రిన్సెస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసిన మాజీ భర్త)


                                          జెండర్‌ రివీల్‌ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)

వీరు బెలూన్‌లు ఎగరవేస్తుంటే.. పులి గాల్లోకి ఎగిరి వాటిని పగలకొడుతుంది. ఇది చూసి అక్కడ ఉన్న జనాలు సంతోషంగా గోలగోల చేయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ సంగతి ఏమో కానీ నెటిజనులు ముఖ్యంగా జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


                                       జెండర్‌ రివీల్‌ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)

‘‘ఇది నిజంగా చాలా తప్పు. భూమ్మీద ఉన్న ఇలాంటి అద్భుత జీవులను మీ స్వార్థం కోసం ఇలా హింసించడం తగదు.. ఇది గర్వించదగ్గ విషయం కాదు’’.. ‘‘ఓ ఆంటీ అది ఏమైనా పెంపుడు జంతువు అనుకున్నావా.. పులితో ఆడుతున్నావ్‌.. దానికి చిర్రెత్తుకొస్తే.. వేటాడేస్తుంది’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు.
 

చదవండి: వివాదంలో యాడ్‌ షూటింగ్‌! అసలు నిజమేంటంటే..

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)