Breaking News

సౌదీలో అపరిచితుడికి లిఫ్ట్ ఇస్తే.. ఉన్న ఉద్యోగం ఊడింది

Published on Wed, 01/14/2026 - 16:31

"కాపురం కాపాడడానికి పోతే కాలు తెగింది" అన్న నానుడి ఈ బాధితుడి వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. పాపం రోడ్డుపై ఒంటరిగా ఉన్నాడనే ఒక వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. తీరా చూస్తే అక్కడి అధికారులు చేసిన తనిఖీల్లో లిప్ట్ ఇచ్చిన వ్యక్తి అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని తేలింది. దీంతో నేరస్థునితో పాటు లిప్ట్‌ ఇచ్చిన వ్యక్తిని జైలులో తోశారు.

సౌదీ అరేబీయాలోని జిజాన్‌లో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళుతున్నాడు. అయితే  అప్పుడు రోడ్డుపై ఓ వ్యక్తి లిప్ట్‌ అడిగాడు. దీంతో అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతనిని వాహనంలోకి ఎక్కించాడు. తీరా కొద్దిదూరం వెళ్లేసరికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వీరిద్దరిని ఆపి పత్రాలు చూపించమని అడగగా ఆవ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో  అతను యెమన్‌కు చెందిన వ్యక్తి అని అతను అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.

దీంతో యెమన్‌కు చెందిన వ్యక్తితో పాటు అతనికి లిప్ట్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసి నెలరోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఆ సదరు ఉద్యోగి తను పనిచేసే సంస్థకు వెళ్లగా కంపెనీ వెహికిల్‌ను ప్రజలను ఎక్కించుకున్నారనే అభియోగంతో వారు ఉద్యోగంలో నుంచి తొలగించారు. అనంతరం అతనికి జీతంతో పాటు అతనికి రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.

విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుండి కేలి సాంస్కృతిక కేంద్రాన్ని సంప్రదించాడు. దీంతో వారు అతనిని తిరిగి భారత్‌కు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని సరైన పత్రాలు లేని వారిని వాహనాల్లో ఎక్కించుకున్నందుకు ఇదివరకూ ఎంతో మంది జైలుపాలయ్యారన్నారు. కనుక సౌదీలో ఉండేవారు ఎవరినైనా వాహనంలో ఎక్కించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)