Breaking News

ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్‌

Published on Sun, 03/30/2025 - 21:53

వాషింగ్టన్:  ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే  తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ  రుచి చూడాల్సి వస్తుందన్నారు.

మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్‌
ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్‌. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్‌ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.

2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దు
ట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో  అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు.  వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌)తో పాటు జర్మనీ, యూరప్‌ యూనియన్‌(ఈయూ)లు, ఇటు ఇరాన్‌ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.

ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్‌లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్‌ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి.  మరి ఇప్పుడు ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్‌.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్‌ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)