Breaking News

‘బందీ ఒప్పందం’పై హమాస్‌కు ట్రంప్ తుది హెచ్చరిక

Published on Mon, 09/08/2025 - 07:37

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హమాస్‌కు తుది హెచ్చరిక జారీ చేశారు. గాజా నుండి బందీలను విడుదల చేయడానికి  ఉద్దేశించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ట్రంప్‌ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌ను కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్  ఏడున ‘ఇజ్రాయెల్ ప్రజలు నా నిబంధనలను అంగీకరించారు. హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ పోస్ట్‌లో రాశారు.

‘ఒప్పందాన్ని అంగీకరించకపోతే వచ్చే పరిణామాల గురించి  ఇప్పటికే హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇదేవిధంగా విలేకరులతో మాట్లాడిన ఆయన గాజా  ఒప్పందానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ‘గాజాపై మనం త్వరలోనే ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం.  బందీల తిరిగి తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. గాజా యుద్ధం మేము పరిష్కరించాలనుకుంటున్న పెద్ద సమస్య’ అని ట్రంప్‌ అన్నారు.
 

గాజాలో మిగిలిన బందీల గురించి ట్రంప్‌ మాట్లాడుతూ యుద్ధం 23వ నెలలోకి అడుగుపెడుతున్నందున అక్కడ మిగిలిన బందీల సంఖ్య 20 కంటే తక్కువగా ఉండవచ్చన్నారు. వారిలో చాలామంది చనిపోయి ఉండవచ్చన్నారు. కాగా ఈ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర మిగిలిన 48 మంది బందీలను ఇజ్రాయెల్‌ జైలులో ఉన్న వేలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా కాల్పుల విరమణ మొదటి రోజునే విడుదల చేయాలి. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపాలి. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇజ్రాయెల్  పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ అ‍న్నారు. హమాస్ బందీలను విడుదల చేసి,  ఆయుధాలను వదిలివేస్తే గాజాలో యుద్ధం ముగించవచ్చన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)