Breaking News

మతిలేని యుద్ధం ఆపండి

Published on Sat, 01/25/2025 - 06:16

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో మతిలేని యుద్ధానికి ఇకనైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో సాధ్యమైనంత త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 ఆంక్షల భయంతో పుతిన్‌ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది నాకు తెలియదు అని ట్రంప్‌ బదులిచ్చారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధక్షేత్రంలో అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు.  రష్యాతో సంధికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్‌ తెలిపారు. 

అబార్షన్‌ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్‌ క్షమాభిక్ష
షికాగో: అబార్షన్‌లకు వ్యతిరేకంగా క్లినిక్‌ల వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వీరికి శిక్షలు విధించడం సరికాదని తెలిపారు. 2020 అక్టోబర్‌లో వాషింగ్టన్‌లోని అబార్షన్‌ క్లినిక్‌ను దిగ్బంధించి, తలుపులు మూసి తాళాలు వేసి నిరసన తెలిపిన లారెన్‌ హార్డీతోపాటు మరో 9 మంది సహ నిందితులకు ట్రంప్‌ క్షమాభిక్ష ప్రకటన వర్తించనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)