Breaking News

పలు దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌.. కారణం ఇదే..

Published on Sun, 12/15/2024 - 09:25

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో వలసదారులకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భయం పట్టుకుంది. అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్ర​ంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ట్రంప్‌ తీసుకుంటున్నారు. ఇక, తాజాగా వలసదారులపై మరో కీలక ప్రకటన చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి. అమెరికాలో ఏయే దేశాల వారైతే ఉన్నారో.. వారిని వెంటనే తమ దేశాలు వెనక్కి పిలిపించుకోవాలి. ఇలా జరగకపోతే.. ఆయా దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలు నిలిపి వేయడం జరుగుతుంది. వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు అమెరికా నుంచి ఎలాంటి వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతులు జరగవు. అన్ని వ్యాపారాలను చాలా కష్టతరం చేస్తాం. ఆ దేశాలకు సుంకాలను భారీగా పెంచేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై పలు దేశాలు టెన్షన్‌ పడుతున్నాయి.  

ఇదిలా ఉండగా.. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వలసదారుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అక్రమ వలదారులు ఎవరున్నా వాళ్ళపై సైనిక చర్యలు తీసుకుంటానని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చట్టాలను అనుసరించే ఎవరైనా తమ దేశంలో ఉండేలా చూసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.

ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో​ డొనాల్ట్‌ ట్రంప్‌ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం వెళ్లింది. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)