Breaking News

మిన్నెపొలిస్‌లో ‘వలస’ల రగడ 

Published on Mon, 01/19/2026 - 06:32

మిన్నెపొలిస్‌: ట్రంప్‌ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్‌ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. 

వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్‌ డౌన్‌టౌన్‌లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. 

తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్‌లాంగ్‌ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్‌ ఉన్నారు. ఆయన బేస్‌బాల్‌ బ్యాట్‌తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్‌.. ఫ్లోరిడాలోని యూఎస్‌ సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.  

మిన్నెపొలిస్, సెయింట్‌ పాల్‌ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్‌ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్‌ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్‌ సిటీస్‌లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్‌ ఆపరేషన్‌లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కాల్పి చంపారు. 

దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్‌ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్‌ గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ట్రిసియా మెక్‌ లాఫ్లిన్‌ అన్నారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)