యుద్ధం ఆపనంటే తీవ్ర పరిణామాలు

Published on Thu, 08/14/2025 - 05:21

వాషింగ్టన్‌/బెర్లిన్‌: ఉక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్రను ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. శుక్రవారం అమెరికా పరిధిలోని అలస్కాలో పుతిన్‌తో భేటీకి మరికొద్ది గంటలే ముగిలి ఉండగా ఆలోపే పుతిన్‌ను హెచ్చరిస్తూ ట్రంప్‌ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంయుక్తంగా యురోపియన్‌ యూనియన్‌ సభ్యదేశాల అగ్రనేతలతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ట్రంప్‌ సైతం వర్చువల్‌గా భేటీ అయి రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రస్తావించారు.

 ‘‘ శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నా. యుద్ధాన్ని ఆపబోనని పుతిన్‌ గనక చెబితే రష్యా తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోక తప్పదు. రెండో దఫా ఆంక్షలను విధంచాల్సి ఉంటుంది. ఒకవేళ భేటీ సత్ఫలితాలనిస్తే వెంటనే పుతిన్, జెలెన్‌స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధపడతా. ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేనూ భాగస్వామినవుతా’’ అని ట్రంప్‌ అన్నారు. వర్చువల్‌ భేటీలో జెలెన్‌స్కీసహా యురోపియన్‌ యూనియన్‌ సభ్యుదేశాల అగ్రనేతలతోనూ ట్రంప్‌ మాట్లాడారు. జెలెన్‌స్కీతో వర్చువల్‌ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్‌ అన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)