Breaking News

నా పార్టీ వాళ్లే తిట్టినా సరే.. సారీ చెప్పను

Published on Sat, 02/07/2026 - 14:00

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తనదైన మొండితనం ప్రదర్శించారు. మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీలను కించపరుస్తూ చేసిన పోస్ట్‌ను సమర్థించుకునే రీతిలో మాట్లాడారు. ఈ క్రమంలో క్షమాపణలు చెప్పాలన్న సొంత పార్టీ నేతల డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు.

శనివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడారు. ‘‘ఆన్‌లైన్‌లో పెట్టిన వీడియో క్లిప్‌లోని ఒక భాగాన్ని నేను ముందే చూశా. కానీ, మొత్తం వీడియోను చూడలేదు. 2020 ఎన్నికల మోసానికి సంబంధించిన పోర్షన్‌ మాత్రం చూశాను. సాధారణంగా నేను ఏ వీడియో అయినా సరే నా సిబ్బందికి ఇస్తా. వారు మొత్తం క్లిప్‌ను పరిశీలించి పోస్ట్‌ చేస్తారు. కానీ ఈసారి ఎవరూ చూడకపోయి ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు.

డెమొక్రట్లతో పాటు రిపబ్లికన్లూ ట్రంప్‌ క్షమాపణలు కోరాలని చేస్తున్న డిమాండ్‌పై ట్రంప్‌ స్పందిస్తూ.. నేను వేలాది విషయాలు చూస్తుంటా. ఏ తప్పూ చేయలేదు. ఇంక క్షమాపణలు ఎందుకు చెప్పడం అని అన్నారాయన.

గురువారం రాత్రి ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో నిమిషం నిడివి ఉన్న వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ది లయన్‌ స్లీప్స్‌ టునైట్‌ అనే పాట బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తుంటే.. ఒబామా జంటను అవమానించినట్లు(కోతులతో పోలుస్తూ) కంటెంట్‌ ఉంది. తీవ్ర విమర్శలు రావడంతో.. ప్రెస్‌ సెక్రటరీ కరోలీనా లెవిట్ట్‌ స్పందించారు. మీమ్‌ వీడియోను పోస్ట్‌ చేయడంలో తప్పేంటి? అని సమర్థించుకున్నారు.

ఆ ఏఐ వీడియోపై డెమొక్రట్లే కాదు.. రిపబ్లికన్లు కూడా తీవ్రంగా స్పందించారు. అది జాత్యాంహకారాన్ని సూచించేలా ఉందని.. తక్షణమే తొలగించి అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని రిపబ్లికన్‌ సెనేటర్‌ టిమ్‌ స్కాట్‌ డిమాండ్‌ చేశారు. ఫేక్‌ అయినా కూడా అలాంటివి చేయడం సరికాదని సౌత్‌ కరోలీనా రిపబ్లికన్‌ ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే 12 గం. తర్వాత ఆ వీడియోను టైం లైన్‌ నుంచి గాయబ్‌ అయ్యింది. వైట్‌హౌజ్‌ ఆ పోస్ట్‌పై వివరణ ఇస్తూ.. పొరపాటున అది పోస్ట్‌ అయ్యిందని.. అందుకే తొలగించామని పేర్కొంది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే..  ఆ ఎన్నికల్లో మోసాలు జరిగాయని.. డొమీనియన్‌ వోటింగ్‌ సిస్టమ్స్‌(Dominion Voting Systems) ద్వారా ఓట్లు దొంగిలించబడ్డాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే డెమొక్రటిక్‌ నేత అయిన ఒబార్‌ ఒబామాను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదే కాదు.. 

గతంలో ఒబామాకు నోబెల్‌ శాంతి బహుమతి రావడంపైనా ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటోడికి ఇచ్చి.. తనకు ఎందుకు ఇవ్వలేదంటూ నోబెల్‌ పీస్‌ కమిటీని ఆయన తిట్టిపోశారు కూడా.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)