Breaking News

మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్‌

Published on Fri, 03/06/2026 - 08:05

వాషింగ్టన్‌: ప్రపంచమంతా యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు.. అటు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్దం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీంతో, మరో యుద్ధం తప్పదని ట్రంప్‌ పరోక్షంగా చెప్పుకొచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తాం. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉంది. క్యూబా అమెరికా మాట వినకపోతే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అంటూ హెచ్చరించారు. చివరకు స్నేహ పూర్వకంగా క్యూబాను దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. మరి ఇరాన్ యుద్ధం అయిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.  

అంతకుముందు కూడా క్యూబా లక్ష్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి రావచ్చు అంటూ కామెంట్ చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)