Breaking News

అమెరికాతో వారికి సంబంధమే లేదు..ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 01/31/2025 - 09:07

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో జన్మతః పౌరసత్వం గురించి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని ట్రంప్‌ కామెంట్స్‌ చేశారు. అంతేగానీ.. ప్రపంచ జనభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చి చేరేందుకు కాదంటూ విరుచుకుపడ్డారు. అర్హత లేని వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

తాజాగా ట్రంప్‌ ఓ కార్యక్రమంలో జన్మతః పౌరసత్వంపై స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. అంతేగానీ.. ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు, ఇక్కడ స్థిరపడేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలా మంది మన అమెరికాకు వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తోంది. ఈ చట్టం అందుకోసం కాదు. చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకు వచ్చింది అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం.. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు.. అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్‌ ఎగువసభ(సెనేట్‌)లో అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్‌ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్‌ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’ అని రిపబ్లికన్‌ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్‌ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును విపక్ష డెమోక్రటిక్‌ పాలిత రాష్ట్రాలు ఫెడరల్‌ కోర్టులో సవాల్‌ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్‌ సర్కార్‌ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు